Thursday, April 25, 2024

క్యాన్సర్ రోగికి బాసటగా(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: క్యాన్సర్ రోగులకు వైద్యచికిత్స ఎంత అవసరమో అంతకుమించి మానసిక స్థైర్యం అవసరం ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడానికి వారు ధైర్యంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇందుకు బయట నుంచి కూడా వారికి మద్దతు, స్పూర్తి అవసరం. ఒక క్యాన్సర్ రోగికి కావలసిన మనోధైర్యాన్ని అందచేస్తున్న కొందరు వ్యక్తులకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్ల కంటతడిపెట్టిస్తోంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులు కీమోథెరపి చికిత్సకు ముందు సాధారణంగా తలమీద వెంటక్రుకలను తొలగించుకుంటారు. కీమో చికిత్స చేసుకునే సమయంలో తలమీద వెంట్రుకలు రాలిపోతాయి కాబట్టి ముందుగానే తలనీలాలను తొలగించుకుంటారు.

Also Read: మాజీ సిఎం చంద్రబాబుకు షాక్

కీమోథెరపి చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఒక క్యాన్సర్ బాధిత మహిళ సెలూన్‌లో తలనీలాలను తొలగించుకుంటున్న సమయంలో విచారం ముంచుకురాగా ఉద్వేగానికి లోనైంది. అది చూసిన బార్బర్ ఆమె ఆవేదనను పోగొట్టేందుకు తాను కూడా తన తలనీలాలను సవ్యంగా తొలగించుకున్నాడు. అది గమనించిన ఆమెకు బాధ రెట్టింపయ్యింది.
ఆ బార్బర్ సహచరులు సైతం ఆమెకు సంఘీభావంగా తమ తల వెంట్రుకలను త్యాగం చేశారు. ఇంటర్‌నెట్‌లో ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ఆ బార్బర్, అతని సహచరుల మానవీయ స్పందనకు నెటిజన్లు జోహార్లు అర్పిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News