Thursday, March 28, 2024

అభ్యర్థుల నేరచరిత్రను 72 గంటల్లో ఇసికి తెలపాలి

- Advertisement -
- Advertisement -

SC

 

 లోక్‌సభకు పోటీ చేసే వారిపై క్రిమినల్ కేసులుంటే వెబ్‌సైట్లలో పెట్టాలి
 అటువంటి వారిని ఎందుకు ఎంపిక చేశారో చెప్పాలి
 పార్టీలు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఇసి మా దృష్టికి తేవాలి : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే ఆ వివరాలను బైటపెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను ఆదేశించింది. అసెంబ్లీ, లోక్‌సభ కు పోటీ చేసే అభ్యర్థులపై క్రిమిన ల్ కేసులు ఉంటే వాటి వివరాలను పార్టీలు తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా నేర చరిత్ర ఉన్నప్పటికీ వారిని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో వివరణ ఇ వ్వాలని కూడా సూచించింది. ఎ న్నికల్లో పోటీకి దిగే ముందు అభ్యర్థులు తమ నేరచరిత్రను ప్రకటించాలని 2018 సెప్టెంబర్ 25న సు ప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తులధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. అభ్యర్థుల నేరచరిత్రకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో విస్తృతంగా ప్రచారం కల్పింంచాలని పేర్కొంది. అయితే ఈ తీ ర్పును రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ ప్రముఖ సీనియార్ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. గత నాలుగు సార్వత్రిక ఎన్నికలనుంచి రాజకీయాల్లో నేరచరితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే ఆ వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో పొందుపరచాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికలు, వార్తాపత్రికల(ఒక జాతీయ వార్తాపత్రిక) ద్వారా కూడా ఈ వివరాలను ప్రచురించాలని ఆదేశించింది. అభ్యర్థులకు నేరచరిత్ర ఉన్నప్పటికీ వారిని ఎందుకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపిక చేశారనే దానిపై కచ్చితమైన కారణాలను వెల్లడించాలని కూడా స్పష్టం చేసింది. నేరచరిత్ర కలిగిన అభ్యర్థులపై 72 గంటల్లోగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక సమర్పించాలని సూచించింది. సుప్రీం ఆదేశాలను రాజకీయ పార్టీలు గనుక ఉల్లంఘిస్తే ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు రావాలని ఇసిని ఆదేశించింది. అభ్యర్థుల నేరచరిత్రను ముద్రించే అంశంపై రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఆదేశాలు, ఫారం 26కు సవరణలపై ఎన్నికల కమిషన్ 2018 అక్టోబర్ 10న నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే ‘ఎన్నికల గుర్తు ఆర్డర్ 1968’కు గానీ, ‘ఎన్నికల నియమావళి’(ఎంసిసి)కి గానీ సవరణలు చేయనందున సదరు నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదనిఆరోపిస్తూ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించాల్సిన, ప్రసారం చేయాలిన దినపత్రికలు, వార్తా చానళ్ల జాబితాను, సమయాలను ఇసి రూపొందించలేదని, ఫలితంగా అభ్యర్థులు అంతగా ప్రాచుర్యం లేని పత్రికల్లో, ఎవరూ చూడని సమయాల్లో వార్తా చానళ్లలో తమ నేరచరిత్రను వెల్లడిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో సదరు వివరాలను వెబ్‌సైట్లలో కానీ, వార్తాపత్రికల్లో కానీ అందించలేదని, అయినా ఇసి వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన శాసన సభ్యుల్లో సగానికి పైగా నేరచరిత్ర కలిగి ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించడం గమనార్హం.

Candidates criminal history report to EC within 72 hrs: SC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News