Home తాజా వార్తలు గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

Cannabis Seized At Chityal In Nalgondaనల్లగొండ:  చిట్యాల సమీపంలో బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు  పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం చిట్యాల వద్ద  జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.  నిందితుడి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.