Home తాజా వార్తలు అంజుబాక వద్ద భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

అంజుబాక వద్ద భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

Cannabis Seized In Bhadradri Kothagudemభదాద్రి కొత్తగూడెం : ఒడిశా నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 421కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుమ్ముగూడెం మండల పరిధిలోని అంజుబాక వద్ద పోలీసులు ఆదివారం మధ్యాహ్నం  వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని, కారును సీజ్ చేశామని, ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 84 లక్షలు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.