Friday, December 2, 2022

ఖమ్మంలో 30 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -

Cannabis Seized In Khammam On Todayఖమ్మం: ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పోలీసులు  భారీ మొత్తంలో గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు యువకులు ముఠాగా ఏర్పడి ఖమ్మం ఖిల్లా బజార్‌లో గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్సు బృందం, వన్ టౌన్ పోలీసులు కలిసి గంజాయి విక్రయిస్తున్న ప్రాంతంలో దాడులు చేశారు. నిందితుల  నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిలో ఖిల్లా బజార్‌కు చెందిన ఎండీ ముజామిల్స్(20), ఎండీ ముదాస్సీర్(21) కార్ డ్రైవర్‌తో పాటు రామన్నపేట గ్రామం, ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన అంకిళ్ల సుమంత్(20), ఎండీ అఫ్రోజ్ (24)  మహాబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన కారు డ్రైవర్ ఎస్‌డీ ఇబ్రహీంలు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందని  ఖమ్మం వన్ టౌన్ సిఐ చిట్టిబాబు తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి  నుంచి కారు, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.

Related Articles

- Advertisement -

Latest Articles