Home తాజా వార్తలు సంగారెడ్డిలో 240 కిలోల గంజాయి పట్టివేత

సంగారెడ్డిలో 240 కిలోల గంజాయి పట్టివేత

Cannabis Seized In Munipally At Sangareddyసంగారెడ్డి : మునిప‌ల్లి మండ‌ల పరిధిలోని కంకోల్ వ‌ద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 240 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి ముంబయికి త‌ర‌లిస్తున్న‌ట్లు తమ విచారణలో తేలిందని మునిపల్లి పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు బొలేరో వాహనాన్ని సీజ్ చేశామని వారు తెలిపారు. బొలేరో  డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.