Thursday, April 18, 2024

జనాభా నియంత్రణపై జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: జనాభా నియంత్రణకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, దీనిపై ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనాభా నియంత్రణకు నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగాలు, ఓటు హక్కు, ఇతర సబ్సిడీలకు ఇద్దరు పిల్లల నిబంధనను తప్పనిసరి చేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. జనాభా నియంత్రణలో గతంలో ‘లా కమిషన్’ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఆదేశాలివ్వాలని ఆయన అభ్యర్థించారు. అయితే పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ ఎస్‌కె. కౌల్, జస్టిస్ ఏఎస్. ఓకా ధర్మాసనం నిరాకరించింది. “జనాభా సామాజిక సమస్య, దీనిపై లా కమిషన్ ఏమని నివేదిక ఇవ్వగలదు? ఇక ఇద్దరు పిల్లల నిబంధనను తప్పనిసరి చేయాలని మీరు కోరుతున్నారు. అది కేంద్రం పని. కోర్టు జోక్యం చేసుకోకూడదు” అని ధర్మాసనం తెలిపింది. దాంతో అశ్విని ఉపాధ్యాయ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News