Home ఎడిటోరియల్ అమరీందర్‌ సింగ్ నిష్క్రమణ

అమరీందర్‌ సింగ్ నిష్క్రమణ

Captain amarinder singh resigns as punjab cm శాసనసభ ఎన్నికలు దగ్గరపడిన సమయంలో ముఖ్యమంత్రులను మార్చడం దేశ రాజకీయాల్లో తాజా వరవడిగా కనిపిస్తున్నది. దేశాన్ని పాలిస్తున్న భారతీ య జనతా పార్టీయే ఈ విషయంలో ముందడుగు వేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా దీనిని ఆదర్శంగా తీసుకున్నట్టుంది. బిజెపి, ఉత్తరాఖండ్ తాజాగా గుజరాత్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చింది. కాంగ్రెస్ పార్టీ తాను అ ధికారంలో ఉన్న పంజాబ్‌లో ఇప్పుడు అదే పని చేసింది. అక్కడి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం నాడు గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనను దారుణంగా అవమానపరిచిందని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత రెండు మాసాల్లో రెండుసార్లు తనకు తెలి యకుండానే పార్టీ ఎంఎల్‌ఎలను అధిష్ఠానం పిలిపించుకొని తనను అగౌరవ పరిచిందని ఇప్పుడు రాష్ట్ర రాజధానిలోనే శాసనసభ పక్షం భేటీని ప్రోత్సహించిందని ఆ యన ఆరోపించారు. అంతేకాదు తన ప్రత్యర్థి, పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ మీద నిప్పులు చెరిగారు. కారాలు మిరియాలు నూరారు.

ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదన్నారు. అతడు పాకిస్తా న్ ఏజెంట్ అని కూడా ఆరోపణ చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో క్రికెట్ రంగంలో సిద్ధూకి ఉన్న పరిచయం తెలిసిందే. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా తన ప్రమాణ స్వీకా రానికి ఆహ్వానించగా సిద్ధూ వెళ్లి వచ్చారు. ఆ సందర్భంలో పాక్ సైన్యాధ్యక్షుడితో సిద్ధూ కరచాలనం చేయడం వివాదస్పదమైంది. ఇప్పుడు అమరీందర్ సింగ్ తప్పుకుంటున్నా డు కనుక పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. కొత్త ముఖ్య మంత్రి పదవికి బలరాం జాకడ్ కుమారుడు మాజీ పిసిసి అధ్యక్షుడు సునీల్ జాకడ్ అలా గే మరో మాజీ పిసిసి అధినేత ప్రతాప్‌సింగ్ బజ్వాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా రవ్‌నీ త్ సింగ్ బిట్టూ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం నాడు సమా వేశం అయిన పంజాబ్ కాంగ్రెస్ శానసభాపక్షం కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించే బాధ్య తను అధిష్ఠానానికే అప్పగించింది. ఇది కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఉన్న అలవాటే, సీల్డ్ కవర్ రాజకీయ వారసత్వ పద్ధతే. పంజాబ్‌లో లక్షణంగా పరిపాలన చేసుకుంటున్న కాంగ్రెస్‌లో ఈ ముసలం అధిష్ఠానవర్గం చేజేతులా సృష్టించుకున్నదే అనే విమర్శ ఉన్నది. కాంగ్రెస్‌లోకి రావడంతోనే ముఖ్యమంత్రి పదవి మీద దృష్టి కేంద్రీక రించారు.

స్వయంగా రాహుల్ గాంధీయే ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. ఇది అమ రీందర్ సింగ్‌కు బొత్తిగా నచ్చలేదు. ఆ తర్వాత కొంతకాలానికి సిద్ధూను పంజాబ్ రాష్ట్ర మంత్రిని చేయడం కూడా అధిష్ఠానం ఒత్తిడి మేరకే జరిగింది. అత్యంత అయిష్టంగానే అమరీందర్ సింగ్ ఆయనకు తన క్యాబినెట్‌లో చోటు కల్పించాడు. అయినా ఇద్దరి మధ్య పరస్పర విమర్శల పర్వం సద్దుమణగకపోగా తీవ్రస్థాయికి చేరుకున్నది. దానిని నివారిం చడంలో అధిష్ఠాన వర్గం విఫలమైంది. ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రానికి సరైన పాలనను ఇవ్వలేకపోతున్నాడనే అభిప్రాయమూ గట్టిపడింది. ఇటీవల జరిగిన ప్ర జాభిప్రాయ సేకరణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఏ కైక అతిపెద్ద పార్టీగా వస్తుందని తేలింది. లేదా కాంగ్రెస్‌కు 49, ఆప్‌కు 44, అకాలీదళ్, సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 20స్థానాలు వస్తాయని మొత్తం మీద హంగ్ అసెంబ్లీ తప్ప దని జోస్యాలు వెలువడుతున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇప్పటికే వాగ్దానం చేశాడు.

ఈ నేపథ్యం లో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకున్నది. 79ఏళ్ల అమరీందర్ హుందాగా పదవి నుంచి దిగిపోయి వుంటే బాగుండేదని అందుకు విరుద్ధం గా ఆయన అధిష్ఠాన వర్గం మీద బాణాలు సంధించాడనే విమర్శ వినవస్తున్నది. దీనిని బట్టి ముందుముందైనా అమరీందర్ సింగ్ పార్టీ నుంచి విడిపోయి వేరే సొంత కుంపటి పెట్టుకోవచ్చనిపిస్తున్నది. అది ఆయనకు పెద్దగా మేలు చేయకపోయినా పార్టీకి అసాధా రణమైన హాని కలిగించవచ్చు. ప్రస్తుత పార్టీ ఎంఎల్‌ఎలలో అమరీందర్ బలం బాగా సన్నగిల్లిపోయింది. గట్టిగా 1520 మంది సభులు ఆయన వెంట కనిపించడం లేదు. అధిష్ఠానం నియమించేబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు, ఎలా నడుచుకుంటారు, సిద్ధూతో కలిసి అడుగులు వేస్తారా లేక పేచీ పెట్టుకుంటారా అనే అంశాలపై పంజాబ్‌లో కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

Captain amarinder singh resigns as punjab cm