Friday, April 19, 2024

కారులో మద్యం సీసాలు… డివైడర్ ను ఢీకొట్టి….

- Advertisement -
- Advertisement -

Car accident in Kompally

మేడ్చల్: డివైడర్ ను కారు ఢీకొట్టిన సంఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగింది. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులో కారులో ఆర్మూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా బిగ్ బజార్ వద్ద డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు కారును స్వాధీనం చేసుకున్నారు. కారులో మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించారు. మద్యం సేవించి కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News