Friday, April 26, 2024

ఒఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డుపై కారు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Car accident in shamshabad ORR Service Road

శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ స‌మీపంలోని ఔట‌ర్ రింగురోడ్డుపై ఆదివారం కారు బీభ‌త్సం సృష్టించింది. ఒఆర్ఆర్ స‌ర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన కారు ఓ బైక్‌ను ఢీకొంది. అంతటితో ఆగ‌ని కారు క‌ల్వ‌ర్టులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్ద‌రు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం సమీప ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కారులో వెళ్తున్న యువకులు మ‌ద్యం సేవించి ఉన్నార‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Car accident in shamshabad ORR Service Road

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News