- Advertisement -
హైదరాబాద్ : వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ఆల్టోకారు అతి వేగంతో డివైడర్ను ఢీకొట్టి పల్లీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు యువకుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పోలీసుల సాయంతో హస్తినాపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఇబ్రహీంపట్నం పరిధిలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. కళాశాల నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
- Advertisement -