Home తాజా వార్తలు ఒఆర్ఆర్‌పై కారు బోల్తా…

ఒఆర్ఆర్‌పై కారు బోల్తా…

Accident
హైదరాబాద్: రాయదుర్గం పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు చౌరస్తా దగ్గర శనివారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టి పల్టీకొట్టింది. అదృష్టవశాత్తు కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతివేగం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని  పోలీసులు చెబుతున్నారు. వాహనదారులలో మార్పు తేవడానికి ఎన్ని నిబంధనలు పెట్టిన వారు పాటించడం లేదని, దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.
Car accidents on Outer Ring Road in Rayadurgam