Friday, March 29, 2024

సోమాలియా రాజధానిలో కారు బాంబు పేలుళ్లు.. వందల్లో మరణాలు!

- Advertisement -
- Advertisement -

Car bomb explosions in the capital of Somalia

వందల్లో మరణాలు!

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో కీలక ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరగా ఉండే రద్దీ కూడలిలో శనివారం రెండు కారు బాంబులు పేలడంతో పెద్ద సంఖ్యలో జనం మృతి చెందినట్లు అనుమానిస్తున్నామని పోలీసు అధికారులు అధికార మీడియాకు తెలిజేశారు. అయిదేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో భారీ ట్రక్కు బాంబు పేలి 500 మందికి పైగా మృతి చెందారు. ఇప్పుడు మరోసారి ఇదే ప్రాంతంలో కారు బాంబులు పేలడం గమనార్హం. ఉగ్రవాద హింసాకాండను ముఖ్యంగా తరచూ రాజధానిని లక్షంగా చేసుకుని దాడులు చేస్తున్న అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ జరుపుతున్న హింసాకాండను ఎదుర్కోవడంపై చర్చించడం కోసం అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతర మంత్రులు సమావేశమైన సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి.

అయితే ఈ పేలుళ్లు తామే జరిపినట్లు ఏ సంస్థా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాను చాలా మృతదేహాలను చూశానని, వారంతా బహుశా ప్రజారవాణా వాహనంలో ప్రయాణిస్తున్న పౌరులు కావచ్చని ఎపి వార్తాసంస్థకు చెందిన జర్నలిస్టు ఒకరు చెప్పారు. రెండో పేలుడు రద్దీగా ఉండే ఓ రెస్టారెంట్ ముందు జరిగిందని అతను తెలిపారు. తీవ్రంగా గాయపడిన, మరణించిన పలువురిని తాము ఆస్పత్రులకు తరలించినట్లు , దాడికి స్పందించి వెళ్తున్న అంబులెన్స్‌ల్లో ఒకటి రెండో పేలుడులో ధ్వంసమైనట్లు ఆమిన్ అంబులెన్స్ సర్వీస్ డైరెక్టర్ చెప్పారు. 2017లో 500 మందికి పైగా మృతి చెందిన ట్రక్కు బాంబుదాడి జరిగిన జోబ్ జంక్షన్ వద్దే ఇప్పుడు కూడా ఈ పేలుళ్లు సంభవించడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News