Home తాజా వార్తలు పరేడ్ మైదానం ఫ్లైఓవర్ పై కారు దగ్ధం

పరేడ్ మైదానం ఫ్లైఓవర్ పై కారు దగ్ధం

Moving car fire on parade ground flyover

హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఫ్లైఓవర్ పై మంగళవారం ఉదయం కారు దగ్ధం అయింది. ఫ్లైఓవర్ పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చూసి అప్రమత్తమైన కారు డ్రైవర్ అందులోంచి దిగిపోయాడు. కారు దగ్ధం ఘటనతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కారు దగ్ధం వల్ల ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ వల్ల ఫైరింజన్ ఘటనాస్థకికి చేరుకోలేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.