Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి

Car Driver Died In Road Accident At Nizamabadనిజామాబాద్:  ఇందల్వాయి వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై కారు టైరు పేలడంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ ఘటనాస్థలిలోనే చనిపోయాడు. మరో నలుగురు తీవ్రంగా  గాయపడ్డారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. గాయపడిన వారిని  చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితులు మోర్తాడ్ మండలం పాలెం వాసులుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం కారు డ్రైవర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.