Saturday, April 20, 2024

జర్మనీ చాన్సలర్ భవనం ప్రధాన గేటును ఢీకొన్న కారు

- Advertisement -
- Advertisement -

Car hits gate outside German leader's offices

బెర్లిన్: జర్మనీ చాన్సలర్ ఆంజెలా మెర్కెల్ కార్యాలయాలు ఉన్న భవనం ప్రధాన గేటును ఒక కారు బుధవారం ఉదయం ఢీకొంది. ఈ సంఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని బెర్లిన్ పోలీసులు తెలిపారు. చాన్సలర్ కార్యాలయం భవనం వెలుపలే అదుపులోకి తీసుకున్న ఆ కారు డ్రైవర్‌ను అంబులెన్సులోనే ఉంచి చికిత్స అందచేస్తున్నట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. పిల్లలు, వృద్ధుల హంతకులు మీరు, ప్రపంచీకరణ విధానాలను నిలిపివేయండి అంటూ ఆ ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ కారుపై రెండు వైపులా తెల్ల పెయింట్‌తో నినాదాలు రాసి ఉన్నాయి. కారు ఢీకొనడంతో చాన్సలర్ కార్యాలయ ఇనుప గేట్లు కొద్దిగా వంగిపోయాయి. ఈ సంఘటనపై మెర్కెల్ కార్యాలయం ఎటువంటి ప్రకటన చేయలేదు.

Car hits gate outside German leader’s offices

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News