Home తాజా వార్తలు నేల తల్లే క్యారమ్ బోర్డ్ గా.. పిల్లల వినూత్న ఆలోచన

నేల తల్లే క్యారమ్ బోర్డ్ గా.. పిల్లల వినూత్న ఆలోచన

ఆ చిన్నారులకు క్యారమ్ బోర్డ్ ఆట ఆడుకోవాలనిపించింది. కానీ వారి దగ్గర బోర్డ్ లేదు. అయితేనేం వారు వారి ఆలోచనలకు పదును పెట్టారు. వారికి వచ్చిన ఆలోచనతో మట్టి పైనే క్యారమ్ బోర్డ్ ను రూపొందించారు.  ఆట వస్తువుల కోసం అమ్మనాన్నలను ఇబ్బంది పెట్టకుండా.. సొంత టాలెంట్‌ను ఉపయోగించిన తెలివైన పిల్లలు వారు. మట్టిని క్యారమ్ బోర్డుగా మలచిన ఈ చిన్నారులు ఇప్పుడు సోషల్ మీడియాను అబ్బురపరుస్తున్నారు.  క్యారమ్ బోర్డులను చెక్కతో తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే, ఈ చిన్నారులు మాత్రం మట్టిని చతురస్ర ఆకారంలో తవ్వి, దాన్ని చదును చేశారు. క్యారమ్ బోర్డులో ఉండే రంద్రాల స్థానంలో నాలుగు వైపులా గుంతలు తవ్వారు. సీసా మూతలను క్యారమ్స్, స్ట్రైకర్‌గా తయారు చేశారు.
మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర సైతం ఈ పేదింటి పిల్లల టాలెంట్‌కు ఫిదా అయ్యారు.‘‘ఈ స్ఫూర్తిదాయక చిత్రాన్ని ఈ రోజు ఉదయం వాట్సాప్ వండర్ బాక్స్‌లో చూశా. ఇండియాలో ఊహాశక్తికి కొదవలేదని చెప్పేందుకు ఈ ఫొటోనే నిదర్శనం’’ అంటూ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

 

Carrom board made with Earthen