Home ఆఫ్ బీట్ ఎగిరే కార్లతో ఎంతో మేలు

ఎగిరే కార్లతో ఎంతో మేలు

Flying-Car

దేశంలోని నగరాల్లో రోడ్ల ప్రయాణం ఒక నరకం. అందుకనే డ్రైవర్‌లేని వాహనాలను నడిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలోని లాస్‌వెగాన్‌లో డ్రైవర్ లేని వాహనాన్ని ప్రయోగాత్మకంగా నడిపించగలిగారు. ఈ ప్రయోగాల స్ఫూర్తితో ‘ఊబర్’ సంస్థ 2020 నాటికి ఎగిరే కారులను ప్రయోగాత్మకంగా విహరింపజేయడానికి సిద్ధమవుతోంది. లాన్‌ఏంజెల్స్‌లో 2028నాటికి జరగను న్న ఒలింపిక్స్ క్రీడా పోటీలో ఈ ఎగిరే కార్లను ఉపయోగంలోకి తేవాలని అనుకొంటోంది. నగరీకరణ ప్రపంచం లో పబ్లిక్, ప్రయివేట్ రవాణా సర్వీస్‌లతో నగరాల్లో ట్రాఫి క్ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణం. ఇప్పుడు ఎగిరే కారులు గొప్ప ప్రయోగం అని చెప్పాలి. ఏదో ఒక రోజు మనిషి తన సెల్ ఫోన్ ద్వారా ఎగిరే కారును ఆపరేట్ చేసి ఎక్కడికైనా వెళ్లి తన పనులన్నీ చూసుకోగలిగితే సాంకేతిక రవాణా వ్యవస్థలో పెద్ద విప్లవాత్మక మార్పు అవుతుంది. ఊబర్ ఎక్కువగా విమాన సర్వీస్‌లను రోజూ నగరాల మీదుగా నడపడానికి ప్రయత్నిస్తుందని ఊబర్ సంస్థ చీఫ్ ప్రాజెక్టు ఆఫీసర్ చెప్పారు. గగన విహార సాంకేతిక వ్యవస్థలో భద్రత, సమర్థత కోసం వ్యవస్థాపరమైన మార్పులు అవసరమన్నారు.

ఈ సాంకేతిక నిర్వహణలో మానవ రహిత రవాణా పద్ధతిని, మానవ రహిత గగన విహారాన్ని ప్రవేశపెట్టి ‘నాసా’కు సహకరించడానికి ‘ఊబర్’ ముందుకు సాగుతోంది. ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వేలాది మందిని ఈ సర్వీస్ ద్వారా తీసుకెళ్లడానికి ముందు ప్రతిచోట ఊబర్ పోర్టులను నెలకొల్పాలన్న లక్షంతో ఉంది. ఎగిరే కారుల ఆలోచన ఉద్వేగం కలిగిస్తోంది. భవిష్యత్తులో నరేంద్ర మోడీ వంటి నాయకులు తాము కోరుకున్న చోటి నుంచి ఎయిర్‌పోర్టులో వెళ్లడం, అక్కడ నుంచి ప్రపంచ నాయకులను స్వల్పకాలంలోనే కలుసుకోగలగడం వంటి అవకాశాలు కలుగుతాయన్న ఆ లోచనలు వస్తున్నాయి. మనలాంటి వాళ్లకు కూడా ఈ సర్వీస్‌లు ఉపయోగపడతాయి. అమెరికా వంటి దేశాల మాదిరిగా మన దేశంలో హెలికాప్టర్ల వినియోగం అం తగాలేదు. ఆ దేశంలో పోలీస్ దగ్గర నుంచి మీడియా బృం దాల వరకు ఏరియల్ సర్వీస్‌ను వినియోగిస్తుంటారు. ఇటువంటి ఏ ప్రయోగాలకయినా లాస్ ఏంజెల్స్ నగరం వేదికని చెప్పవచ్చు. అక్కడ ఉన్న భవనాలూ హెలికాప్టర్లు దిగడానికి, బయలుదేరడానికి వీలుగా నిర్మాణం అవుతుంటాయి.

ఇంటింటికి హెలికాప్టర్ సర్వీస్‌ను వినియోగించుకోవచ్చు. భారతదేశంలో వాహనాల డ్రైవర్లు చేసిన పొరపాట్లు వల్లనే అనేక ప్రమాదాలు, మరణాలు జరుగుతుంటాయి. వీటిని నివారించాలంటే మొదట రోడ్ల స్థితిని గమనించాలి. అయితే ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలను ప్రస్తావించక తప్పదు. డ్రైవర్‌లేని సాంకేతిక విధానం భారతదేశంలో పనిచేయకపోవచ్చు. టూవీలర్లు, త్రీవీలర్లు కూడా ఇంతే. పశువులు, కుక్కలు రోడ్లపై స్వైర విహారం చేస్తుంటాయి. రోడ్ల సమస్యలకు అటానమస్ డ్రైవింగ్ పరిష్కారం కాదు. అయితే టాటా, ఇన్ఫోసిస్ సం స్థలు మాత్రం ఎగిరే కార్లకు భవిష్యత్ ఉందని విశ్వసిస్తున్నాయి. ఎయిర్‌పోర్టుల్లో భద్రతా కారణాల దృష్ట్యా డ్రైవర్ లేని వాహనాలనే వినియోగించడం తప్పనిసరి అవుతుంది. ఎగిరేకార్ల చార్జీలను ధనవంతులే భరించగలరని చెబుతున్నా వీటి వినియోగం ప్రయోజనం కలిగిస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఉదాహరణకు శాంతా క్రూజ్ లేదా సహారా విమానాశ్రయం నుంచి ముంబయి నగరం నడిబొడ్డులోకి పది నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇతిహాసాలలో ఎగిరే విమానాల ప్రస్తావన ఉంది. ప్రాచీనకాలంలోనూ దీని మూలాలు ఉన్నాయి. అలాంటప్పుడు 21వ శతాబ్దంలో ఈ కలను ఎందుకు నిజం చేసుకోకూడదు? అని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.

మనతెలంగాణ, పరిశోధక విభాగం