Home తాజా వార్తలు టిడిపి కోసం డేటా చౌర్యం!

టిడిపి కోసం డేటా చౌర్యం!

AP it gridsఐటి గ్రిడ్స్ ఉద్యోగుల అదృశ్యంపై హెబియస్ కార్పస్

 ఆ నలుగురినీ హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశం
160 కింద నోటిసిచ్చే
విచారిస్తున్నామన్న పోలీసులు
సైబర్ క్రైం సోదాల్లో
హార్డ్‌డిస్క్ స్వాధీనం
డీకోడ్ చేస్తున్న
ఐటి నిపుణులు
ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డికి
ఎపి పోలీసుల బెదిరింపులు
ఎపి పోలీసులపై కేసు నమోదు
డేటా చౌర్యంలో సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్‌ల హస్తం..?

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్ల డేటా కేసులో సైబర్ క్రైం పోలీసుల అదుపులో ఉన్న నలుగురిని సోమవారం ఉదయం 10 గంటలకు హాజరుపర్చాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఐటి గ్రిడ్ సంస్థ సిఇఒ అశోక్ తమ సంస్థ ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, గూడురు చంద్రశేఖర్, రెబ్బల విక్రమ్‌గౌడ్‌ల కనిపించడం లేదని కోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చే శారు. తమ ఉద్యోగులను పోలీసుల పేరి ట తీసుకెళ్ళారని తెలంగాణ హోం శాఖ ప్రినిపల్ సెక్రటరీ, డిజిపి మహేందర్‌రెడ్డి, సైబర్ కైం వింగ్ స్టేషన్ ఆఫీసర్, మాదాపూర్ ఇన్‌స్పెక్టర్‌ను ప్రతివాదులుగా చేరు స్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే డేటా కేసులో ఆ నలుగురికి 160 కింద నో టీసులు ఇచ్చామని, అ తరువాతే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుమని సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు వి వరించారు.

దీంతో స్పందించిన కోర్టు ఏ కుంటుంబ సభ్యులైనా ప్రాణాలు రిస్క్‌లో పెట్టుకుని పోలీసులపై ఫిర్యాదు చేయరని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈక్రమంలో సో మవారం ఐటిగ్రిడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని ప్రతివాదులకు ఆదేశాలిచ్చింది. అలాగే అఫిడవిట్‌తో కోర్టుకు హాజరుకావాలని పిటిషనర్ అశోక్‌కు హైకోర్టు సూచనలు చేసింది. ఇదిలావుండగా డేటా చౌర్యం కేసు తీగలాగితే డొంక కదులుతోంది. భద్రంగా ఉంచాల్సిన కీలక సమాచారం బట్టబయలు కావడం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నివాసి లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఐటి గ్రిడ్స్ సంస్థ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్ల జాబితా, ఆధార్ కార్డులు, లబ్దిదారుల కీలక డేటాను సేకరించినట్లు తెలుస్తోంది.

డేటా చోరీ వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురి నేతల హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత భద్రంగాఉంచాల్సిన డేటా బయటికి ఎలా లీక్ అయ్యిందన్న అంశంపై తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు ఐటి గ్రిడ్స్ సంస్థకు ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, గూడురు చంద్రశేఖర్, రెబ్బల విక్రమ్‌గౌడ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐటి గ్రిడ్స్‌కు ఈ డేటా ఎలా వచ్చింది..? ఎవరిచ్చారు అన్న విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా డేటా చోరీ వ్యవహారంలో ఓ సీనియర్ ఐఎఎస్ హస్తం ఉందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశలో ఆధార్‌తో సంబంధం ఉన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ద్వారానే డేటాను ఐటిగ్రిడ్స్ సంస్థ సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్న సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల ప్రమేయంతోనే డేటాను ఐటి గ్రిడ్స్ సంస్థకు అందిందన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనాలు రేపుతున్న డేటా విషయంపై ఫిర్యాదు చేసిన లోకేశ్వరరెడ్డికి బెదిరింపులతో పాటు వేధింపులు రావడంతో ఆయన ఎపి పోలీసులపై ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఐటి గ్రిడ్స్‌లో సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటాను క్లోడ్ సర్వర్‌లో భద్రపరచగా హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటాను డీకోడ్ చేసే పనిలో ఐటి నిపుణులు నిమగ్నమయ్యారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లో దాదాపు ఒకటిన్నర కోటి మందికి సంబంధించిన ఓటరు, ఆధార్‌ల డేటా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

ఐటి గ్రిడ్స్ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ సహ ఉద్యోగి అశోక్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ సంస్థకు చెందిన ఉద్యోగులను అక్రమంగా నిర్భందించారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సంస్థ ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, గూడురు చంద్రశేఖర్, రెబ్బల విక్రమ్‌గౌడ్‌లు కనిపించడంలేదని తెలంగాణ హోం శాఖ ప్రినిపల్ సెక్రటరీ, డిజిపి మహేందర్‌రెడ్డి, సైబర్ కైం వింగ్ స్టేషన్ ఆఫీసర్, మాదాపూర్ ఇన్‌స్పెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. టిడిపికి సేవలందిస్తున్న ఐటి గ్రిడ్స్ సంస్థలో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం విదితమే. దీంతో వివాదం రాజుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేవరకు వెళ్లింది.

ఎపి ప్రభుత్వం ‘పోలీసు’ ప్రయోగం

ఐటి గ్రిడ్స్ డేటా కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఐటి గ్రిడ్స్ గుట్టును బట్టబయలు చేయడంతో ఎపి ప్రభుత్వం వాస్తవాలు కప్పిపుచ్చుకునేందుకు పోలీసులను ప్రయోగిస్తోంది. ఓట్ల తొలిగింపుపై ఫిర్యాదు చేసిన కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఎపి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లిలోని అశోక్ నివాసం వద్ద ఎపి పోలీసులు ఆదివారం భారీ ఎత్తున మోహరించారు.

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు లోకేశ్వర్‌రెడ్డిని సైబరాబాద్ కమిషనరేట్‌కు తరలించారు. తెలంగాణ, ఎపి పోలీసుల మధ్య డేటా వార్ ముదురుతోంది. శనివారం అర్థరాత్రి మొదలైన వివాదం ఆదివారం నాటికి కొనసాగింది. కూకట్‌పల్లిలోని అశోక్ ఇంటికి విచారణ కోసం వెళ్లిన ఎపి పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఘటనా స్థలంలో వీడియోలు తీసేందుకు ఎపి పోలీసులు చేసిన యత్నాలను అడ్డుకున్నారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌పి విజయరావు తెలిపారు.

ఐటిగ్రిడ్స్ సిఇఒ అశోక్‌కు నోటీసులు

డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐటి గ్రిడ్స్ సిఈఒ అశోక్‌కు 161 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం లోపు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఐటిగ్రిడ్స్‌కు చెందిన నలుగురు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా తమ ఉద్యోగులను పోలీసులమని చెప్పి ఎవరో తీసుకెళ్లారని హైకోర్టులో ఐటిగ్రిడ్స్ సంస్థ సిఈఒ అశోక్ హెబియస్ కార్పస్ దాఖలు చేశారు.

ఒకవైపు వేధింపులు, మరోవైపు బెదిరింపులు
ఫిర్యాదు దారుడు లోకేశ్వర్‌రెడ్డి

ఐటి గ్రిడ్స్ సాఫ్‌వేర్ కంపెనీకి ఎపి ఓట్ల సమాచారం లీక్ అయ్యిందని ఫిర్యాదు చేస్తే తనను వేధింపులతో పాటు బెదిరింపులకు గురిచేస్తున్నారని కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్‌రెడ్డి పేర్కొంటున్నారు. ఓటర్ల డేటా ప్రైవేటు సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లిందన్న ప్రశ్నించినందుకు తనను ఎపి పోలీసులు వేధిస్తున్నారన్నారు. ఆదివారం గచ్చీబౌలిలోని సిపి కార్యాలయం ఆవరణలో మాట్లాడుతూ ఎపిలో వ్యవస్థలు నాశనం అవుతున్నాయని ఆరోపించారు. ఎపి ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా చేరిందదన్న విషయం తాను ఫిర్యాదు చేయడంతో బెదిరింపులు, వేధింపులు మొదలయ్యాయన్నారు.

దొంగ ఓట్లపై ఏడాదిన్నర కాలంగా తాము పోరాటం చేస్తున్నామన్నారు. వైఎస్సార్ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఒక సామాజిక కార్యకర్తగా, టిక్నికల్ అంశాలు తెలిసిన వ్యక్తిగా కేసు వేశానన్నారు. ఎపి పోలీసులు తమ ఇంటిపై దాడి చేశారని, పరుషపదజాలంతో వేధించారన్నారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసులను ఆశ్రయించానన్నారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని లోకేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎపి ఎన్నికల కమిషన్ సీరియస్

ఓట్లు తొలగించే అధికారం కేవలం ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉందని, అనుమతి లేకుండా ఓట్లు తొలగించడానికి వీల్లేదని ఎపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తేల్చిచెప్పారు. ఈక్రమంలో ఓట్ల తొలగింపునకు సంబంధించి కేసులు నమోదు చేయాలని ఎపిలోని అన్ని జిల్లాల కలెక్టర్లకుఆదేశాలిచ్చారు.

గతవారంలో వేల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారం.7 అప్లికేషన్లు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ గు ర్తించిందన్నారు. ఓటర్లకు తెలియకుండా ఓట్లు తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామన్నారు. ఈ తరహా వ్యవహారంపై ఇప్పటికి ఎపిలోని 9 జిల్లాలో 45వేల కేసులు నమోదు చేశామన్నారు. అలాగే 6 మీ సేవా కేంద్రాలపైనా కేసులు పెట్టామన్నారు.

Case against IT firm for misusing voter data