కర్నాటక: నటి సింధూ మీనన్ సోదరుడు మనోజ్కార్తీ పై కేసు నమోదు అయింది. బ్యాంకును మోసం చేశారంటూ గత మూడు రోజుల క్రితం సింధూపై ఆర్ఎంసి యార్డు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మంగళవారం నటి సోదరుడు కార్తీపై యశ్వంతపుర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్నిమనోజ్ కార్తీ, సుధా, రాజశేఖర్లు లీజ్ తీసుకున్నారు. లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లను నకిలీ సృష్టించి బ్యాంకులో రుణం కోసం తాకట్టు పెట్టాడు. విషయాన్నిగుర్తించిన బిల్డింగ్ యజమాని గణేశ్ రావు యశ్వంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.