Saturday, April 20, 2024

వదంతులు వ్యాపింపజేసినందుకు బిజెపి నాయకుడిపై కేసు!

- Advertisement -
- Advertisement -

చెన్నై: సోషల్ మీడియా ద్వారా తమిళనాడులో బీహార్ వలస కార్మికులపై హిందీలో మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయని, చంపుతున్నారని వదంతులు వ్యాపింపజేసిన ఉత్తర్‌ప్రదేశ్ బిజెపి నాయకుడిపై కేసు దాఖలయింది. తమిళనాడులో భాషాపరమైన విభేదాలు సృష్టించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ బిజెపి యూనిట్ ప్రతినిధి ప్రశాంత్ ఉమ్రావ్ ట్వీట్ చేశాడు. ‘హిందీలో మాట్లాడినందుకు తమిళనాడులో బీహార్‌కు చెందిన 12 మంది వలస కార్మికులను చంపేశారు’ అని అతడు ట్వీట్ చేశాడు. పైగా బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ ఫోటోలను కూడా అందులో షేర్ చేశాడు. వాట్సాప్‌లో గతవారం బీహార్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ అనేక బూటకపు మెసేజ్‌లు కూడా పోస్ట్ అయ్యాయి. అందుకు తమిళనాడు, బీహార్ ప్రభుత్వాలను కూడా టార్గెట్ చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ ఓ ప్రకటన కూడా చేశారు. అందులో ‘వలస కార్మికులు కలత చెందాల్సిన పనిలేదు. మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా హాట్‌లైన్‌ను సంప్రదించండి. వలస వచ్చిన సోదరులను తమిళనాడు ఎల్లవేళలా రక్షిస్తుంది’ అని చెప్పారు. తమిళనాడు జిల్లా కలెక్టర్లు ఈ సందేశాలను హిందీలో ప్రచురించారు. వలస కార్మికులు కలత చెందాల్సిందేమీ లేదని తెలిపారు.

బిజెపి నాయకుడు ప్రశాంత్ ఉమ్రావ్ తన ట్వీట్‌లో ‘బీహార్ నుంచి తమిళనాడుకు వలస వచ్చిన 12 మంది వలస కార్మికులను హిందీలో మాట్లాడినందుకు ఉరేసి చంపారు.’ అని రాయడమే కాకుండా తేజస్వీ యాదవ్, ఎంకె. స్టాలిన్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. పైగా ఒక ప్రక్క బీహార్ వలస కార్మికులపై దాడులు జరుగుతుంటే మరో ప్రక్క తేజస్వీ యాదవ్, స్టాలిన్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు అని అక్కసు వెల్లగక్కాడు. ఈ ట్వీట్‌కు 14000 లైక్‌లు కూడా వచ్చాయి. కానీ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News