Home తాజా వార్తలు హీరో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు..?

హీరో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు..?

Raj Tarunరంగారెడ్డి : మంగళవారం అల్కాపురి టౌన్‌షిప్‌లో జరిగిన కారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 279, 336 కింద సుమోటోగా కేసు నమోదు చేసినట్టు నార్సింగ్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రికార్డు అయిన సిసి పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు వారు వెల్లడించారు. కారులో ఉన్నది తెలుగు హీరో రాజ్ తరుణ్ అని గుర్తించినట్టు వారు చెప్పారు. కారు ప్రమాదం అనంతరం రాజ్‌తరుణ్ ఘటనాస్థలి నుంచి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన అనంతరం రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో రాజ్ తరుణ్ పై కూడా కేసు నమోదు చేశామని, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై రాజ్ తరుణ్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నట్టు ఆయన వెల్లడించారు. నార్సింగి సర్కిల్ లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను  కారుపై నియంత్రణ కోల్పోయానని ఆయన తెలిపారు. దీంతో కారు పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో తాను భయాందోళనలకు గురయ్యానని, ఈ క్రమంలోనే తాను మరో కారులో నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్టు ఆయన చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే వెలుగు చూస్తాయని ఆయన పేర్కొన్నారు. తన యోగక్షేమాలు తెలుసుకుంటున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీటు బెల్టే తనను ప్రమాదం నుంచి కాపాడిందని, ప్రతిఒక్కరూ  సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు.

Case Filed Against Tollywood Hero Raj Tarun