Sunday, June 15, 2025

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పిఎస్ లో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లో రెండ్రోజుల క్రితం ట్రాఫిక్‌ పోలీసులతో శ్రీనివాస్‌ దురుసుగా ప్రవర్తించారు. జర్నలిస్ట్ కాలనీ వద్ద కారుతో రాంగ్‌రూట్‌లో వెళ్లి కానిస్టేబుల్‌పై దూసుకవచ్చారు. కానిస్టేబుల్ కారు ఆపినందకు అతడిపై హీరో దుర్భాషలాడారు.

కాగా, ‘అల్లుడు శ్రీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్ ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన ఊహించినంత సక్సెస్ కాలేకపోయారు. త్వరలో ఆయన ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News