Home జాతీయ వార్తలు ప్రధాని వద్ద క్యాష్ రూ.4700 మాత్రమే

ప్రధాని వద్ద క్యాష్ రూ.4700 మాత్రమే

pm-modiఆస్తి విలువ కోటి పైన   నాలుగు ఉంగరాలు, అప్పుల్లేవు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తుల వివరాలను మంగళవారంనాడు ప్రధానమంత్రి కార్యాలయం ప్రక టించింది. దాని ప్రకారం ఆయన చేతిలో కేవలం రూ.4,700 నగదు మాత్రమే ఉంది. ప్రధాని మొత్తం ఆస్తుల విలువ మాత్రం రూ. 1.41కోట్లకు చేరింది. మోడీ 13ఏళ్ల క్రితం కొన్న ఇంటి విలువ దాదాపు 25 రెట్లు పెరిగింది. దాంతో ఆయన ఆస్తి విలువ కూడా పెరిగినట్టయింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఆయన చేతిలో రూ.4,700 నగదు మాత్రమే ఉంది. ప్రధాని స్థిర, చర అస్తుల విలువ కలిపి రూ. 1,26, 12, 288 నుంచి 1,41,14,893కు చేరింది. ప్రధాని పేరు తో ఎటువంటి వాహనాలు లేవని, ఆయన బ్యాంకు ఖాతాను గుజరాత్‌లోనే కొనసాగిస్తున్నారని పిఎంఒ స్పష్టం చేసింది. ఇక ఢిల్లీలో మోడీకి ఎటువంటి బ్యాంకు ఖాతాలు లేదని వెల్లడించింది. ప్రధాని వద్ద 45 గ్రాముల బరువు ఉన్న నాలుగు బంగారు ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. 2015 మార్చి నాటికి వాటి విలువ రూ. 1,19,000. 2014లో వీటి విలువ రూ. 1,21,000గా చూపించారు. ఆయన పేరుతో ఎటువంటి అప్పులు లేవు. ఈ జనవరి 30, 2016 వరకు ఆయన ఆస్తుల వివరాలను నమోదు చేశారు. మోడీ వద్ద రూ.20,000 విలువైన ఎల్‌అండ్‌టి ఇన్‌ఫ్రా బాండ్లు ఉన్నాయి. వీటితోపాటు రూ.5.45లక్షలు విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, రూ.1.99లక్షల విలువైన జీవిత బీమా పాలసీలతో కలిపి మొత్తం రూ. 41.15లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. గాంధీనగర్‌లో ఒక నివాసిత ప్లాటులో ఆయనకు నాలుగో వంతు భాగం ఉంది. దాన్ని 2002లో కొన్నట్లు తెలిపారు.