Home జాతీయ వార్తలు అభివృద్ధికి పట్టం కట్టారు

అభివృద్ధికి పట్టం కట్టారు

amit

కుల, వారసత్వ రాజకీయాలకు తిరస్కారం : అమిత్‌షా

న్యూఢిల్లీ: గుజరాత్,హిమాచల్ ప్రదశ్ ఎన్నికలలో ఓటర్లు కుల, వారసత్వ రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధికే పట్టం కట్టారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఓటర్లును తమ పార్టీపై విశ్వాసం ఉంచారని  అన్నారు.  కోట్లాది మంది కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమించడం వల్లే విజయం సాధ్యమైందని, ఇది కార్యకర్తల గెలుపుగా ఆయన వర్ణించారు. బిజెపి ని గెలిపించినందుకు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రెండు రాష్ట్రాలలో ఓటర్లు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు పట్టం కట్టారని స్పష్టం చేశారు. గుజరాత్‌లో కులం కార్డుతో గెలవాలనుకున్న కాంగ్రెస్‌ను ఓటర్లు తిరస్కరించారని, హిమాచల్‌ప్రదేశ్‌లో అవినీతిని ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. కుల, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పాయన్నారు. గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరు జరగలేదని, తాము పూర్తి ఆధిక్యం సాధించామన్నారు. తమకు గుజరాత్ లో ఓట్ల శాతం కూడా పెరిగిందని అమిత్ షా వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. దేశంలో 2014 నుండి ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వస్తున్నామని, నరేంద్ర మోదీ నాయకత్వంలో 19  రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నామని, మిత్ర పక్షాలతో కలపి 21 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామని తెలిపారు. కర్ణాటక సహా వచ్చే సంవత్సరం రాబోయే మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్  రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి బిజెపి విజయం సాధిస్తామన్న నమ్మ కం ఉందని అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు బీజేపీ కార్యకర్తల తరపున, తన తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మరోసారి గుజరాత్ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ప్రధాన మం త్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల అనుకూల కార్యక్రమాల వల్ల రెండు రాష్ట్రాలలో  విజయం సాధించామని స్పష్టం చేశారు. మోదీ పని తీరును ప్రజలు బలపరుస్తున్నారన్నారని, మోదీ నాయకత్వంలో కోట్లాదిమంది బిజెపి కార్యకర్త లు దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. రాబోయే ఐదేళ్ళ లో ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.ఈ ఎన్నికలలో ప్రముఖ కాంగ్రెస్ నేతలంతా ఓటమిపాలయ్యారన్నారంటూ కాంగ్రెస్ ప్రచారం ఔట్‌సోర్సింగ్ అయిందని ఎద్దేవా చేశారు. త్రిపుర, మేఘాలయ, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కూ డా బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నా రు. గుజరాత్ లో తాము 1990 నుండి ఒక్క సారి కూడా ఓటమి ఎరుగలేదని, ఈ విజయం ఆరవసారి వరుసగా లభించిందన్నా రు.2012 నుండి పోలిస్తే తమ ఓట్ల శాతం కూడా పెరిగిందని, ప్రస్తుతం 49.5 శాతం ఓట్లు సాధించామన్నారు. గుజరాత్ ఎన్నికలలో విజయంసాధించినందుకు సిఎం విజయ్‌రూపాని,డి ప్యూ టీ సీఎం నితిన్ భాయి పటేల్,పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జితూ వాఘానికి మరియు పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.