Home జోగులాంబ గద్వాల్ గుట్టుగా క్యాట్‌ఫిష్ పెంపకం

గుట్టుగా క్యాట్‌ఫిష్ పెంపకం

Catfish

 

రెండు వందల చెరువుల్లో సాగు, చూసీచూడన్నట్లు వ్యవహరిస్తున్న అధికారులు

గద్వాల : గుట్టుగా విషపు సాగును కొనసాగిస్తున్నారు. వీటిని నివారించాల్సిన అధికారులు చూసీ చూడన్నట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమంగా చేపల చెరువును ఏర్పాటు చేసుకొని అటు సాగుకు ఉపయోగపడే నీటిని విద్యుత్తును అక్రమంగా వాడుకుంటున్నారు. కొన్ని చెరువులకు అనుమతులు తీసుకోవడం మరి కొన్నింటికి తీసుకోకుండానే యథేచ్ఛగా క్యాట్ ఫిష్ చెరువులను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.

కృష్ణా నది తీరం వెంబడి పుట్టగొడుగుల ఈ క్యాట్ ఫిష్ చెరువులు పుట్టుకొస్తున్నాయి. ధరూర్ మండలపరిధిలోని ఉప్పేరు, ఖమ్మంపాడు, గార్లపాడు, గద్వాల మండలంలోని లత్తి పురము, బీరెల్లి, రేకులపల్లి, ఇటిక్యాల మండలంలోని షేక్‌పల్లి, తిమ్మాపురం, కొండే రు, కొండపేట తదితర నది తీర ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. సుదూర ప్రాంతా ల నుంచి ఇక్కడకు వలస వచ్చి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని క్యాట్ ఫిష్ పెంపకాలు చేపడుతున్నారు.

గ్రామ నాయకుల అండతో..
నది తీర ప్రాంతంలోని గ్రామ నాయకుల అండదండలతో క్యాట్ ఫిష్‌ల పెంపకం కొనసాగుతుంది. నదికి అనుకొని ఉన్న బీడు పడిన పొలాలను వేల రూపాయలకు కౌలుకిచ్చి వారిచేత క్యాట్‌ఫిష్ చేపల చెరువులను ఏర్పాటు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటు అధికారులకు కూడా చూసీచూడన్నట్లు వ్యవహరించడానికి నెలనెలా డబ్బులు ముట్టచెబుతున్నారని వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిని స్థానిక నాయకులు చూసుకుంటున్నారు.

క్యాట్‌ఫిష్‌లు తింటే..
క్యాట్‌ఫిష్ చేపలు తింటే ప్రాణాంతక రోగాలు వస్తాయి. క్యాన్సర్ తదితర రోగాలతో పాటు మానవునికి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. అందు వల్ల ఈ చేపల పెంపకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికి కొందరు వ్యాపారులు మీ చేపల పెంపకాన్ని చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరు హైదరాబాద్‌కు తదితర ప్రాంతాలు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. కుళ్లిపోయిన కోళ్ల వ్యర్థాలను తీసుకువచ్చి వాటిని మామూలుగా ఉడికించి క్యాట్ ఫిష్‌లకు ఆహారంగా వేస్తారు. అదే విధంగా చనిపోయిన కుక్కల కళేభరాలు, పందుల కళేభరాలు కోళ్ల పారాల దగ్గర చనిపోయిన కోళ్లను తీసుకువచ్చి ఈ చెరువులో అలాగే వదిలేస్తారు.

వాటిని తిని చేపలు పెరుగుతాయి. పొరపాటున చేపల చెరువులో కొత్త వారు కాలు పెడితే ఆ కాళ్లు సైతం గాయపరుస్తుంది. ఈ క్యాట్ ఫిప్ చేపలు ప్రత్యేకంగా ఒక వ్యాన్‌ను ఏర్పాటు చేసుకొని జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాలలో చికెన్ సెంటర్ల దగ్గర ఉన్న వ్యర్థాలను తీసుకొచ్చి వీటికి ఆహారంగా వేస్తారు. తక్కువ ఖర్చు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఈ చేపలు వస్తుండటంతో వీటిని పెంచడానికి కొందరు ఇష్టపడుతుంటారు.

అన్నీ అక్రమమే..
ఈ క్యాట్‌ఫిష్ చేపల చెరువులు అన్ని అక్రమంగానే ఉన్నా యి. నదిలోని నీటిని అక్రమంగా వాడుకుంటున్నారు. రైతులకు ఉచిత కరెంటు అక్రమంగా చేపల చెరువులకు వాడుకున్నారు. ఇలా క్యాట్‌ఫిష్ చేపల చెరువులలో అన్ని అక్రమ దందాలే కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా సంబ ంధిత అధికారులు స్పందించి చేపల చెరువులపై దృష్టి పెట్టి వీటిని అరికట్టాలంటే అవసరం ఎంతైనా ఉన్నది.

Catfish can cause life-threatening illnesses