Home మహబూబ్‌నగర్ కాసులు కురిపిస్తున్న క్యాట్‌ఫిష్

కాసులు కురిపిస్తున్న క్యాట్‌ఫిష్

Cat-fishఇటిక్యాల: ప్రభుత్వం మత్సకారులకు జీవనం కోసం చేపల పెంపకం చేపట్టుకుని జీవించే విధంగా అనుమతులు ఇచ్చింది కాని దాని చాటున నిషేదిత క్యాట్‌ఫిష్ చేపలను పెంచరాదని కేంద్ర ప్రభుత్వం 2005 ఏప్రిల్ 4న నిషేదించడం జరిగింది. కాని కొందరు అధికారుల అండదండలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తదితర జిల్లాల నుంచి మండలానికి వచ్చి మండల పరిధిలోని మొగిలిరావుల్‌చెర్వు, శివనోంపల్లి, పుటాన్‌దొడ్డి, జింకలపల్లిస్టేజీ పరిసర ప్రాంతాల్లో అధిక మొత్తంలో చేపలు పెంచుకునేందుకు చెరువులను ఏర్పాటు చేసుకుని క్యాట్‌ఫిష్ చేప పిల్లలను గోప్యంగా పెంచుతూ అటువంటి వాటిని రాత్రిళ్లు తరలించి వాటిని పెంచుతున్న వ్యాపారానికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు చేపల చెరువులు గ్రామానికి అతి సమీపంలో ఉండడంతో వీటిని పెంచడం కోసం వేసే వ్యర్థ పదార్థాలు కుళ్లిపోయి చనిపోయిన చేప పిల్లలను ఉడకబెట్టి చేపలకు వేసి చెరువులో వేసి క్యాట్‌ఫిష్ చేపలను పెంచుతున్నారు. వీటికి అయ్యే ఖర్చు సాధారణ చేపలు పెంచే వాటికంటే 30శాతం ఆదా అవుతుండడంతో అధిక మొత్తంలో చేపలు పెంచుతున్నారు.
రాత్రిళ్లు తరలింపు
ఇలా పెంచిన చేపలను రాత్రి వేళల్లో బెంగుళూరు, కేరళ, తమిళనాడు, కర్నాటక ప్రాంతాలకు రాత్రి వేళల్లో మ్యాక్సిలు, డీసీఎంలలో గోప్యంగా తరలిస్తున్నారు.

కంపు భరించలేకపోతున్నామంటున్న ప్రజలు
చేపల చెరువులు గ్రామాలకు సమీపంలో ఉండడంతో ప్రతి రోజు చేపలకు కుళ్లిపోయిన మాంసం, కుళ్లిపోయిన కోడిగుడ్లు వేయడంతో చెరువు పక్క వ్యవసాయం చేస్తున్న రైతులు వాసన భరించలేకపోతున్నామని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఫలితం లేకపోవడంతో ఈ వాసన్ని భరించలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో పత్రికల్లో కథనాలు వచ్చిన అధికారులు స్పందించకపోవడానికి కారణమేంటంటున్నారు. దీంతో గ్రామాల్లోని ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుల్లో చేపలకు వేసే వ్యర్థ పదార్థాలను నిరోధించి వాసనను రాకుండా అరికట్టి తమను ఆదుకోవాలని గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు.