Home అంతర్జాతీయ వార్తలు కరోనాతో జర జాగ్రత్త : డబ్ల్యుూహెచ్ఒ

కరోనాతో జర జాగ్రత్త : డబ్ల్యుూహెచ్ఒ

Caution With CoronaVirus : WHOజెనీవా: ప్రపంచంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున అన్ని దేశాలు అప్రమత్తతతో ఉండాలని డ‌బ్ల్యూహెచ్‌ఒ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌న‌మ్ గెబ్రియేస‌స్ హెచ్చరించారు. మరో రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన వారంలో సుమారు 40 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే. ఈ సంఖ్య మరో రెండు వారాల్లో 20 కోట్లు దాటే అవకాశం కనిపిస్తుందని ఆయన తెలిపారు. ఇది కేవలం తమ అంచనా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పలు దేశాల్లో డెల్టా వేరియంట్ ఉధృతి అధికంగా ఉండడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.