Home అంతర్జాతీయ వార్తలు ధశల వారీగా బొగ్గు వినియోగం తగ్గింపుపై చర్చ

ధశల వారీగా బొగ్గు వినియోగం తగ్గింపుపై చర్చ

Cautious coal phaseout still on table

 

గ్లాస్గో వాతావరణ సదస్సులో కొత్త లక్ష్యాలతో ప్రతిపాదనలు

గ్లాస్గో : స్కాట్‌లాండ్ లోని గ్లాస్గోలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో సాగిన చర్చలు భూతాపాన్ని నియంత్రించ డానికి ప్రపంచ దేశాలు తీసుకునే చర్యలకు మరింత ప్రోత్సాహం అందించాయి. ఈమేరకు కొత్త ఒప్పందాల నమూనా నివేదికలు శనివారం విడుదలయ్యాయి. విద్యుత్‌ఉత్పత్తికి బొగ్గు వినియోగాన్ని , శిలాజ ఇంధన సబ్సిడీలను దశల వారీగా తగ్గించుకోడానకి ప్రతిపాదించారు. ఆర్థిక లాభార్జన కోసం ఎవరైతే శిలాజ ఇంధన పరిశ్రమల్లో పనిచేస్తున్నారో వారు క్రమేణా ఆయా ఉద్యోగాలను, వాణిజ్యాలను వదులు కోవలసి ఉంటుందని ప్రతిపాదించారు. చర్చలకు అధ్యక్షత వహించిన బ్రిటిష్ అధికారి లోకేష్ శర్మ ఈ సదస్సులో దేశాలు తగిన అవకాశాలను వినియోగించుకుని ఆశాజనక ఒప్పందానికి వస్తారని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. అయితే కొన్ని వర్గాలు మాత్రం ప్రస్తుత ప్రతిపాదనలు అంత పటిష్టంగా లేవని వ్యాఖ్యానించాయి.

ఈ ప్రతిపాదనలు అంత ప్రయోజన కరంగా లేవని ఆక్స్‌ఫామ్‌కు చెందిన ట్రేసీ కార్టీ వ్యాఖ్యానించారు. హరితవాయువుల నియంత్రణపై మరో ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఇదివరకు అగ్రదేశాలు కానీ అభివృద్ది చెందుతున్న దేశాలు కానీ ప్రతి పదేళ్లకు ఈ లక్షాలను సాధించాలని గడువు నిర్దేశించుకొనేవి. కానీ ఇప్పుడు 2035 కు బదులు 2025 కు, 2040 కు బదులు 2030 కు లక్షాలు సాధించాలని కొత్తగా ప్రతిపాదించారు. పారిశ్రామిక యుగం కన్నా ముందటి స్థాయికి భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలని 2015 లో ప్యారిస్ ఒప్పందం నిర్దేశించినప్పటికీ అంతకన్నా వేగం, తొందరగా, సుస్థిరంగా హరిత వాయువులను నియంత్రించుకోవాలని ప్రతిపాదించారు.

Cautious coal phaseout still on table