Home తాజా వార్తలు రూ.1.54 లక్షల కోట్లు రిఫండ్

రూ.1.54 లక్షల కోట్లు రిఫండ్

CBDT issues Rs 1.54 lakh crore refunds to taxpayers

 

1.59 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ చేసిన సిబిడిటి

న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు రూ.1.54 లక్షల కోట్లు రిఫండ్ చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సిబిడిటి) వెల్లడించింది. 2021 ఏప్రిల్ 1 నుండి 2022 జనవరి 10 వరకు 1.59 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఈ రిఫండ్ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ గురువారం ఒక ట్వీట్‌లో తెలిపింది. 1.56 కోట్ల కేసుల్లో దాదాపు రూ.53,689 కోట్లు ఆదాయపు పన్ను రీఫండ్ చేయగా, 2.21,976 కేసుల్లో రూ.1,00,612 కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రీఫండ్ చేసినట్లు సిబిడిటి తెలిపింది. రిఫండ్ అందకపోతే, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయవచ్చు. మీరు మీ పాన్, లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ పనిని సులభంగా చేయవచ్చు. ఒకవేళ రీఫండ్ అందకపోతే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో మీ ఆదాయపు పన్ను ఖాతాకు లాగిన్ అయి వివరాలను తెలుసుకోవచ్చు.