Home తాజా వార్తలు 63.23 లక్షల పన్ను చెల్లింపుదారులకు రిఫండ్

63.23 లక్షల పన్ను చెల్లింపుదారులకు రిఫండ్

CBDT issues Rs 92,961 cr refunds to 63.23 lakh taxpayers

 

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ 1 నుండి అక్టోబర్ 18 వరకు దాదాపు 63.23 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ.92,961 కోట్లను రీఫండ్ చేసింది. దీనిలో 61.53 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ.23,026 కోట్ల రీఫండ్ వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్ ఉంది. ఇక మిగతా 1.69 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ.69,934 కోట్ల కార్పొరేట్ పన్ను రిఫండ్ చేసినట్టు సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ట్విట్టర్‌లో ప్రకటించింది. 202122 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటి రిటర్న్‌ల దాఖలుకు గడువు తేదీని ఇటీవల డిసెంబర్ 31 వరకు సిబిడిటి పొడిగించింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్టా ఈ నిర్ణయం తీసుకుంది.

CBDT issues Rs 92,961 cr refunds to 63.23 lakh taxpayers