Friday, March 29, 2024

అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సిబిఐ వాదనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. తెలంగాణ హైకోర్టులో సిబిఐ వాదనలు వినిపిస్తోంది. అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏదోసాకు చూపి తప్పించుకుంటున్నారని సిబిఐ ఆరోపించింది. వివేకా హత్యకు నెల రోజుల ముందే కుట్ర జరిగిందని సిబిఐ తెలిపింది.

దీనిపై స్పందించిన హైకోర్టు రాజకీయంగా అవినాష్ బలవంతుడే అని మీరే అంటున్నారు.. అలాంటప్పుడు వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ల దగ్గర నుంచి ఏమైనా సమాచారం రాబట్టారా? అని కోర్టు ప్రశ్నించింది. విచారణకు వాళ్లు సహకరించడం లేదని కోర్టు దృష్టికి సిబిఐ లాయర్ తీసుకెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News