Thursday, April 25, 2024

లంచాల కోసం కక్కుర్తిపడిన సిబిఐ అధికారుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

CBI Arrests its Own DSP in Corruption Case

న్యూఢిల్లీ: బ్యాంకులకు చెందిన రూ. 4,300 కోట్ల రుణాలను ఎగవేసిన కంపెనీలకు ఒక ముఠాగా ఏర్పడి సహాయపడ్డారన్న ఆరోపణలపై సిబిఐ డిఎస్‌పి ఆర్‌కె రిషి, సిబిఐ ఇన్‌స్పెక్టర్ కపిల్ ధన్‌కడ్, ఒక న్యాయవాదిని సిబిఐ బుధవారం అరెస్టు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో రిషికి చెందిన ఇంటితోపాటు రూర్కీలోని ఆయన భార్యకు చెందిన ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. స్వప్రయోజనాల కోసం కొన్ని కేసుల దర్యాప్తులను నీరుగార్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై రిషి, ధన్‌కడ్‌తోపాటు న్యాయవాది మనోహర్ మాలిక్, డిఎస్‌పి ఆర్‌కె సంగ్వాన్, మరో న్యాయవాది అరవింద్ కుమార్ గుప్తాలపై సిబిఐ కేసులు నమోదు చేసింది.

ఇదే కేసుకు సంబంధించి శ్రీశ్యామ్ పల్ప్ అండ్ బోర్డు మిల్స్ అదనపు డైరెక్టర్ మందీప్ కౌర్ ధిల్లాన్, ఫ్రాస్ట్ ఇంటర్సేషనల్ కంపెనీ డైరెక్టర్లు సుజయ్ దేశాయ్, ఉదయ్ దేశాయ్‌ల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో సిబిఐ చేర్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేసే ధన్‌కడ్ డిప్యుటేషన్‌పై సిబిఐలో ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. రూ. 700 కోట్ల రూపాయల రుణ ఎగవేత కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న శ్రీశ్యామ్ పల్ప్ కంపెనీకి, రూ. 3,600 కోట్ల రుణ ఎగవేత కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీకి కీలక సమాచారాన్ని చేరవేసినందుకు ధన్‌కర్‌తోపాటు రిషి, సంగ్వాన్‌కు కూడా ప్రతినెలా ముడుపులు ముట్టాయని సిబిఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

CBI Arrests its Own DSP in Corruption Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News