Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ‘జగన్’ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై గడువు కోరిన సిబిఐ

‘జగన్’ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై గడువు కోరిన సిబిఐ

CBI has sought deadline on jagan discharge petition

మనతెలంగాణ/హైదరాబాద్ : పెన్నా ఛార్జ్‌షీట్ నుంచి పేరు తొలగించాలన్న ఎపి సిఎం వైఎస్ జగన్ పిటిషన్‌పై సిబిఐ కోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. ఎపి సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సిబిఐ మరింత సమయం కోరింది. ఈ క్రమంలో పెన్నా, ఇందూ టెక్‌జోన్ కేసుల నుంచి తొలగించాలని సబిత పిటిషన్లపై విచారణ జరిగింది. సబిత డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలుకు సిబిఐ సమయం కోరింది. శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ఆగస్టు 2కు వాయిదా పడింది.

విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డి కోరడంతో ఈ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అదేవిధంగా సిబిఐ కోర్టులో ఒఎంసి కేసు విచారణ జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలకు సిద్ధం కావాలని సబితకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. ఒఎంసి కేసులో మరో ఛార్జ్‌షీట్ వేయబోయమని సిబిఐ తెలిపింది.