Home జాతీయ వార్తలు ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరంపై సిబిఐ చార్జిషీట్

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరంపై సిబిఐ చార్జిషీట్

 

 

న్యూఢిల్లీ:  ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ, మాజీ మీడియా అధిపతి ఇంద్రానీ ముఖర్జీతో సహా 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సిబిఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చిదంబరంను అక్టోబర్ 24 వరకు ప్రశ్నించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు గురువారం అనుమతి ఇచ్చిన సిబిఐ కోర్టు అదే రోజు జుడిషయల్ కస్టడీని పొడిగించింది. 2007లో విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులను స్వీకరించడానికి ఐఎన్‌ఎక్స్ గ్రూపునకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ బోరు అనుమతి ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని 2017 మేలో సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆగస్టు 21న సిబిఐ అధికారులు అరెస్టు చేసిన నాటి నుంచి చిదంబరం తీహార్ జైలులో ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

 
CBI named Chidambaram in chargesheet, besides Chidambaram the chargesheet mentioned 14 others including Karti, Indrani Mukherjee