Saturday, April 20, 2024

సిసోడియాకు తిరిగి సిబిఐ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆదివారం విచారణకు హాజరుకావాలని సిబిఐ శనివారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సమన్లు వెలువరించింది. కేసుకు సంబంధించి సిబిఐ మూడు నెలల క్రితం ఛార్జీషిట్ దాఖలు చేసింది. ఇందులో నిందితుడిగా సిసోడియాను సిబిఐ చేర్చలేదు. అయితే ఆయనపైనా ఇతరులపైనా విచారణ సాగుతున్న క్రమంలో విచారణకు రావాలని సిసోడియాకు సమన్లు పంపించినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 17వ తేదీన సిబిఐ ఈ ఆప్ నేతను విచారించింది. ఆయన నివాసం, బ్యాంకులాకర్లలో తనిఖీలు నిర్వహించింది.

ఇప్పటికీ విచారణ సాగుతున్నందున మరిన్ని కీలక వివరాలు రాబట్టుకునేందుకు సిసోడియాను విచారిస్తున్నట్లు సిబిఐ తెలిపింది. ఇప్పటికి పలుసార్లు సిబిఐ పలు రకాల సోదాలకు దిగిందని, తనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారం వారికి దొరకలేదని, తాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా సిబిఐ దర్యాప్తునకు తగు విధంగా సహకరిస్తానని సిసోడియా ఓ ట్వీటులో తెలిపారు. తనకు సమన్లు అందిన విషయాన్ని నిర్థారించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే మంచిపనులు కంటగింపుగా మారిన వారి కోసం సిబిఐ ఏదైనా చేయాల్సి ఉంటుందని, ఇందులో భాగంగానే తనను తిరిగి పిలుస్తున్నారని సిసోడియా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News