Saturday, April 20, 2024

ఎంపి అభిషేక్‌బెనర్జీ బంధువుకు సిబిఐ సమన్లు

- Advertisement -
- Advertisement -

CBI summons MP Abhishek Banerjee's relative

పోంజీ స్కాంలో బెంగాల్ మంత్రికి కూడా
ఈ నెల 15న హాజరు కావాలని ఆదేశం

న్యూఢిల్లీ: బొగ్గు అక్రమ తవ్వకాల కేసులో టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ సమీప బంధువు అంకుశ్‌అరోరాకు సిబిఐ సమన్లు జారీ చేసింది. అంకుశ్‌తోపాటు ఆయన తండ్రి పవన్‌అరోరాను సిబిఐ అధికారి ముందు ఈ నెల 15న హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవల అభిషేక్ భార్య రుజిరాతోపాటు అంకుశ్ భార్య మేనకా గంభీర్‌ను సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరోవైపు పోంజీ స్కాంలో బెంగాల్ విద్యాశాఖమంత్రి, మమతాబెనర్జీ సన్నిహితుడు పార్థాఛటర్జీకి కూడా సిబిఐ సమన్లు జారీ చేసింది. మార్చి 15న సిబిఐ బృందం ముందు హాజరు కావాలని ఆదేశించింది.

ఐకోర్ ఇసర్వీసెస్ కేసులో సిబిఐ ఈ ఆదేశాలిచ్చింది. పెద్ద మొత్తాల్లో తిరిగి ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి రూ.౩౦౦౦ కోట్లకుపైగా ఈ సంస్థ సేకరించినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఇదే కేసులో ఐకోర్ మేనేజింగ్ డైరెక్టర్లైన అనుకూల్‌మైతీ, ఆయన భార్య కనికాను సిబిఐ 2017లో అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడైన మైతీ జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా భువనేశ్వర్ హాస్పిటల్‌లో మృతి చెందారు. బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనవేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడైన అభిషేక్‌తోపాటు ఆ రాష్ట్ర మంత్రికి సిబిఐ సమన్లు పంపడం పట్ల రాజకీయ విమర్శలొస్తున్నాయి. దీంతో,బెంగాల్‌లో బిజెపి, టిఎంసి మధ్య ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనున్నది.

CBI summons MP Abhishek Banerjee’s relative

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News