Thursday, April 18, 2024

హథ్రాస్ సామూహిక అత్యాచార సంఘటనపై సిబిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ హథ్రాస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన సంఘటనపై సిబిఐ ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సిబిఐ వెల్లడించింది. అంతకు ముందు ఈ సంఘటనపై బాధితురాలి సోదరుని ఫిర్యాదు మేరకు చాంద్‌పా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెప్టెంబర్ 14న తన సోదరిని చిరుధాన్యాల పొలంలో నలుగురు వ్యక్తులు అత్యాచారంతోపాటు దాడి చేశారని ఫిర్యాదులో వివరించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ పై ఈ కేసును సిబిఐ నమోదు చేసినట్టు సిబిఐ అధికార ప్రతినిధి ఆర్‌కె గౌర్ వెల్లడించారు. 19 ఏళ్ల బాధితురాలు అనేక గాయాలతో ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సెప్టెంబర్ 29న మృతి చెందింది. అగ్రకులాల వారు సెప్టెంబర్ 14న హత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

CBI to start Probe in Hathras Incident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News