Home జిల్లాలు నిఘానీడలో పాతబస్తీ

నిఘానీడలో పాతబస్తీ

commisonr-mahender-reddyనగరంలో సుమారు లక్షకు పైగా సిసిటివి కెమెరాల ఏర్పాటు
ప్రపంచంలోనే సేఫ్ సిటీగా హైదరాబాద్
సిసిటివి కెమెరాల ప్రారంభోత్సవంలో పోలీస్
కమిషనర్ మహేందర్‌రెడ్డి
చార్మినార్ : కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరా ప్రాజెక్ట్‌లో భాగంగా ఆదివారం కామాటిపురా పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. నగర పోలీస్‌కమీషనర్ మహేందర్‌రెడ్డి ఎన్‌టీపీసీ రిజినల్ ఎక్స్‌క్యూటీవ్ డైరెక్టర్ విబి ఫెడ్నవిస్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ ని సేఫ్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అందులోభాగంగానే హైదరాబాద్‌నగరంలో సుమారు లక్షకు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోనే సేఫ్ సిటీగా పేరొందిన లండన్ సిటీ మాదిరిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని ఆయన తెలిపారు. కమ్యూనిటీ సీసీకెమెరాల ఏర్పాటుకు ప్రజలు, కార్పోరేటర్ సంస్దలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎంతగానో సహాకరిస్తున్నారని ఆయన తెలిపారు. నిరుపేదలున్న పాతబస్తీ వాసుల సౌకర్యార్దం సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు అడిగిన వెంటనే ఎన్‌టీపీసీ సంస్ద ముందుకు వచ్చి కామాటిపురా, బహదూర్‌పురా, కాలపత్తర్ స్టేషన్ల పరిధిలో కోటి రూపాయలతో 120 సీసీకెమెరాలను అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. సీసీటీవీ కెమెరాల వలన కాలనీలు, బస్తీలకు రక్షణ ఉంటుందని ఎవేని సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు నింధుతులను సులువుగాగుర్తించి వారికి శిక్షపడేలా చేయవచ్చన్నారు.350 కోట్లరూపాయలతో బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కమాం డ్‌కంట్రోల్ రూంలకు ఈ సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేసి అక్కడ నుండికూడ హైదరాబాద్ సిటీని పరిరక్షిస్తామని ఆయన తెలిపారు. ఎన్‌టీపీసీ రిజినల్ డైరెక్టర్ విబి ఫెడ్నవిస్ మాట్లాడుతూ ఎన్‌టీపీసీ దేశంలోనే అతిపెద్ద విద్యుత్‌సంస్ద అని దీని ద్వారా చిన్నారులకు విద్య, వైద్యల వంటి సామాజిక సేవాకార్యక్రమాలతో పాటు నిరుపేదల ఉండే మురికి వాడల్లో, పాఠశాలలో వేలాది మరగుదొడ్లు నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమాజసేవలో తమసంస్ద ఎల్లవేలల ముందువరుసలో ఉంటుదని ఆయన గుర్తు చేశారు. సీసీటీవీల ఏర్పాటు వలన ఎన్నో లాబాలున్నాయని సామాజిక భద్రతలో భాగంగా వీటి ఏర్పాటుకు మరిన్న సంస్దలు ముందుకురావాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఎన్‌టీపీసీ ఎస్‌ఆర్‌హెచ్‌క్యూ డాక్టర్ ప్రతాప్, బహదూర్‌పురా శాసనసభ్యులు మౌజం ఖాన్, కార్పోరేటర్లు అబ్దుల్‌గఫార్, సోహేల్‌ఖాద్రీ, దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ, అదనపు డీసీపీబాబురావు, ఎసీపీ అశోకచక్రవర్తి, ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌లతోపాటు దక్షిణమండలంకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.