Home Default బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ గత చరిత్ర : సిఇసి

బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ గత చరిత్ర : సిఇసి

CEC Sunil Aroraఢిల్లీ : బ్యాలెట్ పేపర్ తో ఓటింగ్ గత చరిత్రని సిఇసి సునీల్ అరోరా తెలిపారు. ఈ పద్ధతిలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, ఈ విషయాన్ని మర్చిపోవాలని ఆయన తేల్చి చెప్పారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కొన్ని పార్టీలు తమను కోరాయని, అయితే అది అసాధ్యమని తాము చెప్పినట్టు ఆయన వెల్లడించారు. ఇవిఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇవిఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.  ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచాలని కొన్ని పార్టీలు కోరాయని, అయితే ఖర్చుల పరిమితిని మరింత తగ్గించాలని మరికొన్ని పార్టీలు కోరాయని ఆయన వెల్లడించారు. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఈ క్రమంలో తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింప చేస్తామని ఆయన పేర్కొన్నారు.

CEC Sunil Arora Comments On Voting with Ballot Paper