Home వార్తలు 100 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్న ‘బెనారస్’హిందు విశ్వవిద్యాలయం

100 సంవత్సరాల ఉత్సవం జరుపుకుంటున్న ‘బెనారస్’హిందు విశ్వవిద్యాలయం

benaras11916 సంవత్సరంలో పండిట్ మదన్‌మోహన్ మాలవ్య స్థాపించిన “బెనారస్ హిందు విశ్వవిద్యాలయం” (పూర్వపు సెంట్రల్ హిందు కాలేజి). ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో స్థాపించబడింది. సుమారు 20వేల మంది విద్యార్థులతో అతి పెద్దదైన రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాల్లో మొదటిది. బెనారస్ పాలకులలో వంశపారంపర రాజైన కాశీనరేష్ చేసిన భూదానంలో 1300 ఎకరాల విస్తీర్ణంలో (సుమారు 5.3కి.మీ.)లో యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ నిర్మించారు.
జాతిని మేల్కొల్పి విద్యను ప్రాథమిక ఆయుధంగా భావించిన అప్పటి ప్రముఖ న్యాయవాది, సంఘ సంస్కర్త అయిన పండిట్ మదన్ మోహన మాలవ్య స్థాపించిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం “బెనారస్ హిందు విశ్వవిద్యాలయం”.1905 సంవత్సరంలో డిసెంబర్‌లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ 21వ సమావేశంలో భారతరత్న పండిట్ మదన్‌మోహన్ మాలవ్య బహిరంగంగా తమ ఉద్దేశం ప్రకటిస్తూ వారణాసిలో ఒక విశ్వవిద్యాలయం స్థాపనంగా ప్రకటించారు. మాలవ్య అభ్యర్థన మేరకు సంత్ బాబా అత్తర్‌సింగిజీ మత్సువానా 1914 సంవత్సరంలో యూనివర్సిటీ స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాతమాలవ్య యూనివర్సిటీ అభివృద్ధి కలను సాకారం చేస్తూ ఇతర విద్యావేత్తలతో, జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపేవారు. భారతదేశంలో పేదలకు నిర్మూలన, ఆదాయ వృద్ధి పెంపు, యూరోపియన్లతో పోల్చుకుంటూ అభివృద్ధి బాటలో నడవాలంటే సైన్స్, సాంకేతికరంగం అభివృద్ధిపరచాలని భావించి మత సంస్కృతితో పాటు సాంకేతికత అభివృద్ధి సాధ్యం అని భావించి ఆ దిశగానే దృష్టిపెట్టారు.
మాలవ్య తన ఆలోచనలకు రెండు మార్గాలు తోచాయి. ఒకటి ప్రభుత్వ గుర్తింపు పొందుట లేదా స్వతంత్రంగా వ్యవహరించటం. వివిధ కారణాల దృష్టా మొదటి మార్గాన్ని ఎంచుకున్నారు. కాని ఏ మీడియంలో వ్యవహరించాలి. ప్రథమంగా ఇంగ్లిష్ మీడియంతో ప్రారంభించి తర్వాత హిందీ, ఇతర భారతీయ భాషలలో విస్మరిస్తూ వచ్చారు. విశేషం ఏమిటంటే అనిబిసెంట్ కూడా సెంట్రల్ హిందు స్కూల్ పరిధి పెంచి యూనివర్సిటీగా స్థాపించాలనుకున్నారు. హిందూ ఫిలాసఫీ ఆధారంగా వారణాసిలోనే స్థాపించాలని అనుకున్నారు. మాలవ్య కూడా అనిబెసెంట్‌కు మద్దతునిస్తూ తన వంతుగా రూ.2,50,000లను విరాళంగా సేకరించారు. 1907 సంవత్సరంలో అనిబెసెంట్ యూనివర్సిటీ స్థాపనకు ‘రాయల్ చార్టర్’కు దరఖాస్తు చేశారు. కాని బ్రిటిష్ ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేదు. అది అలా ఉండగా మాలవ్య తన న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి యూనివర్సిటీ అభివృద్ధికి పాటుబడ్డారు. 1911 సంవత్సరం నవంబర్ 22 హిందూ యూనివర్సిటీగా రిజిష్టర్ చేసి యూనివర్సిటీ భవనాల కోసం నాలుగేళ్ల అవిరాళ కృషి చేసి విరాళాలు సేకరించారు.
benaras31915 సంవత్సరం అక్టోబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ బెనారస్ హిందూ యూనివర్సిటీ బిల్లును లెజిస్లెటివ్ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. 1915 సంవత్సరం నవంబర్‌లో అనిబెసెంట్, భగవాన్ దాస్, ఇతర ట్రస్టీలు సెంట్రల్ హిందూ స్కూల్‌ను ప్రభుత్వ నిబంధనలపై యూనివర్సిటీలో ఒక భాగం చేశారు. వివిధ ప్రైవేట్ వ్యక్తుల నిరంతర కృషి ఫలితంగా 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన జరిగింది.
1916 సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 4న భారతదేశంలో మొదటగా బెనారస్ హిందూ యూనివర్సిటీ మొదలైంది. యూనివర్సిటీ ప్రారంభమైన రోజు నుండి ఫిబ్రవరి 5-8 తేదీల మధ్య మహాత్మగాంధీ ఉపన్యాసంతో ప్రారంభమై తర్వాత ప్రముఖ విద్యావేత్తల ఉపన్యాసాలు అనగా జగదీష్ చంద్రబోస్, డా॥ ప్రఫ్రుల్ల చంద్రరాయ్, ప్రొ॥ శ్యామ్ హిగ్గింబాదం, సర్- ప్యాట్రిక్ గిడ్డీస్, అనిబెసెంట్ మొదలగువారు ఉపన్యసించారు. మాలవ్య కలల సాకారం బెనారస్ ఇంజినీరింగ్ కాలేజి 1919 జనవరి 17న స్థాపించారు. ఆ యూనివర్సిటికి మైసూరు కృష్ణరాజు వడయార్ -IV తన పర్యటన సందర్భంగా యూనివర్సిటీని సందర్శిచారు. 1919 జనవరి 17న మొదటి స్నాతకోత్సవం నిర్వహించారు.
గంగానది ఒడ్డున వారణాసి లక్ష్మీ దక్షిణభాగంలో 5.3కి.మీ., 1300 ఎకరాల విస్తీర్ణంలో 60 హాస్టళ్లు 1200 మంది విద్యార్థులతో పూర్తిస్థాయి అధ్యాపకులతో నిర్మించారు. సాయాజీరావు గౌక్వాడ్ లైబ్రరీలో 2011సంవత్సరం లెక్కల ప్రకారం 1.3మిలియన్ల వాల్యుమ్స్ ఉన్నట్టు అంచనా. ప్రధాన లైబ్రరీకి అనుగుణంగా మూడు స్థానిక లైబ్రరీలు, ఎనిమిది అధ్యాపక లైబ్రరీలు, 25 డిపార్టుమెంట్ లైబ్రరీలు విద్యార్థులు, సిబ్బందికోసం అందుబాటులో ఉన్నాయి.
1920 సంవత్సరం జనవరిలో అదే క్యాంపస్‌లో భారత కళా భవన్ పేరున కళ, పురావస్తు ప్రదర్శన శాఖను ప్రారంభించారు. అందుకు తొలి చైర్మన్‌గా నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్‌ను నియమించగా, ఆయన మేనల్లుడు అవనీంద్రఠాగూర్‌ను వైస్‌చైర్మన్‌గా నియమించారు. రాయ్ కృష్ణదాస్ అమితమైన ప్రయాసలతో మ్యూజియంను అభివృద్ధి చేశారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ :
హాస్టల్ వసతితో కూడిన కో-ఎడ్యుకేషన్ సంస్థ యూనివర్సిటీ ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ నిర్వహిస్తారు. ఎంబీబీఎస్‌కు అదనంగా పి.హెచ్‌డిలు, ఫిజీషియన్లు, సర్జరీలు కాక నర్సింగ్, ఆయుర్వేదిక్, దంత, ఆరోగ్యశాస్త్రాల్లో కూడా కోర్సులు ఆహ్వానిస్తారు. భారతదేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా పేరొంది 19 ఫీజీషియన్లను, ఆయుర్వేదం, దంత వైద్యరంగంలో కూడా దేశానికి అందించింది. డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ అక్కడ అడ్మినిస్ట్రేటర్‌గా సేవలందించి తర్వాత కాలంలో రాష్ట్రపతి అయ్యారు. 1916 సంవత్సరంలో ప్రారంభ కార్యక్రమాలకు హాజరైన గణిత శాస్త్ర నిపుణులు సర్.సి.వి.రామన్ 1930 సంవత్సరంలో నోబుల్ గ్రహీతగా పేరొందారు. విద్యార్థులుగా టి.వి.రామకృష్ణన్, కృష్ణకాంత్, కొత్తపల్లి జయశంకర్ మొదలగు ఎందరో మహానుభావులు అడుగిడినారు. అధ్యాపకులుగా గణేశ్ ప్రసాద్, శాంతిస్వరూప్ భట్నాగర్, ప్రఫుల్వకుమార్ మొదలగువారు సేవలందించారు.  2016 సంవత్సరంగాను వందేళ్ల ఉత్సవం జరుపుకుంటూ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రఘుకుమార్, 9441241915