Home మంచిర్యాల నేడు క్రిస్మస్ సంబరాలు

నేడు క్రిస్మస్ సంబరాలు

christmas

మన తెలంగాణ/మంచిర్యాల కల్చరల్ : ప్రతి యేటా డిసెంబర్ 25న క్రైస్తవులు భక్తి శ్రద్దలతో చర్చీలకు వెళ్లి రోజంత ప్రార్థనలు చేస్తు ఎంతోవైభంగా క్రిస్మస్ డే జరుపుకుంటారు. ఈ దినం ఏసు ప్రభు పుట్టిన రోజుగా భావించి ఒకరికి ఒక్క రు శుభాకాంక్షలు చెప్పుకుంటూ బందువులను, స్నే హితులను ఇంటికి ఆహువానించి మిఠాయీ లు పంచిపెడతారు. కళాకారులు శాంతాక్లాజా, మేరీ మాత వేశాలు ధరించి చిన్నపిల్లలను నవ్విస్తూ చిలిపి చేస్టలు చేస్తూ పిల్లలకు బహుమతులు పంచిపెడతారు. చర్చీలలో ఫాదర్స్ బైబిల్ బోదించి అం దులోని సారాంశాన్ని విన్నవిస్తారు. గాయకులు క్రైస్తవ పాటలు పాడుతూ శ్రోతలను అలరిస్తారు. ప్రతి ఆదివారం క్రైస్తవులు ప్రార్థనలు చేసుకోవడం పరిపాటి కాబట్టి ఒక్కరోజు ముందు నుండే క్రైస్తవాలయలు జనంతో కిక్కిరిసి పోయాయి. చెర్చీలు కొత్త కొత్త రంగులతో, డిస్కోబల్బ్‌లతో అంగరంగ వైబవంగా వెలిగి పోతున్నాయి.