Home తాజా వార్తలు ఒకే గ్రామం.. ఒకే గణేశుడు

ఒకే గ్రామం.. ఒకే గణేశుడు

Vinayakachavati festival

 

నియోజకవర్గంలోని 17 గ్రామాల్లో తీర్మానం
తీర్మాన బాటల్లో మరిన్ని గ్రామాలు
పూజల్లో పాల్గొని బహుమతులు అందించనున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేట : ఆదర్శ నియోజకవర్గమైన సిద్దిపేట మరో మంచి కార్యక్రమానికి వేదికగా నిలువనుంది. వినాయకచవితి సందర్భంగా ఒకే గ్రామం… ఒకే వినాయకుడు అంటూ మరోమారు ఐక్యతను చాటనుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచనల మేరకు నియోజకవర్గంలోని 17 గ్రామాలకు చెందిన గ్రామస్థులంతా ఐక్యతతో ఉండి తమ గ్రామంలో ఒకే చోట వినాయక విగ్రహాన్ని నెలకొల్పుతామని తీర్మానాలు చేశారు. ఒకే గ్రామం.. ఒకే గణేశుడు ఇదే బాటలో మరిన్ని గ్రామాలు ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామస్థులంతా కలిసి ఒకేచోట విగ్రహాన్ని నెలకొల్పి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించనున్నారు.

మొదటగా సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామస్థులు తమ గ్రామంలో ఒకేచోట విఘ్నేశ్వరున్ని ఏర్పాటు చేసుకుంటామని తీర్మానం చేశారు. ఇదే స్ఫూర్తిగా తీసుకొని మిగతా16 గ్రామస్థులు సై తం ముందుకు రావడం గ్రామస్థులు ఐక్యతకు నిదర్శనం. ఈ నవరాత్రుల్లో గ్రామస్థులంతా ఒకేచోట ఒకే విగ్రహాన్ని భక్తి శ్రద్దలతో పూజించి వినాయకచవితి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వినాయక నవరాత్రు ల్లో భాగంగా ఒకే గ్రామం… ఒకే వినాయకుడు ప్రతిష్టించిన గ్రామాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్వ యంగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకులకు బహుమతులు సైతం అందించనున్నారు. గ్రామంలో ఒకే విగ్రహాన్ని నెలకొల్పుతామని తీర్మానం చేసిన గ్రామస్థుల కు ఇప్పటికే హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.

తీర్మానాలైన గ్రామాలు… సిద్దిపేట మునిసిపల్ పరిధిలోని ర ంగధాంపల్లి, సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి, కిష్టసాగర్ గ్రామస్థులు తీర్మానం చేశారు. అలాగే సిద్దిపేట రూ రల్ మండలంలోని బండచెర్లపల్లి, మాచాపూర్, నారాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్, కోదండరావుపల్లి, గుర్రాలగొంది, గోపులాపూర్, బంజేరుపల్లి, నంగునూరు మ ండలం బద్దిపడగ, నర్మెట్ట, ఖానాపూర్, అంక్షాపూర్, మైసంపల్లి, కొండంరాజుపల్లి, చిన్నకోడూరు మండలం సికింద్లాపూ ర్ గ్రామస్థులు తమ గ్రామంలో ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని తీర్మానం చేశారు.

Celebrating Vinayakachavati festival is great pleasure