Home తాజా వార్తలు సిఎం కెసిఆర్ జన్మదినం వేడుక….ఓయులో హరితహారం

సిఎం కెసిఆర్ జన్మదినం వేడుక….ఓయులో హరితహారం

Osmania University Students

మన తెలంగాణ/ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ విద్యార్థి జేఏసి నేత డా.దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్ ఆద్వర్యంలో విద్యార్థులు శనివారం ఓయూ ఆర్ట్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ప్రియతమ నేత, ఉద్యమనేత, బంగారు తెలంగాణ ప్రధాత సిఎం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పుల్వా మా సైనికుల త్యాగం దేశం మరువలేనిదని, జవానుల త్యాగాలను గుర్తిస్తూ సీఎం కేసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రక్తదానం చేయడం, మొక్కలు నాటడం, పలు సామాజిక సేవా కార్యమ్రాల్లో పాల్గొనాలని కోరారు. సైనికుడు దేశానికి రక్షణ ఇస్తే మొక్క మనిషికి ప్రాణవాయు వు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అలువాల జితేందర్, షేక్‌సైదా, సంపత్, యాదగిరిరావు, అద్వైత్‌రెడ్డి, నజీ ర్, అఖిల్, రాము, రాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Celebration Of CM KCR Birthday in OU