Home తాజా వార్తలు సింగరేణిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సింగరేణిలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Celebrations for Telangana Formation Day

 

ఇల్లందు: ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిఎమ్ ఎమ్. సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం స్ధానిక జిఎమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మే 27వ తేదిన సింగరేణి వివిధ విభాగాలలో పనిచేస్తున్న మహిళలకు జిఎమ్ కార్యాలయం నందు సాయంత్రం 4 గంటలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. అదే విధంగా 28, 29, 30, 31, వ తేదీలలో సింగరేణిలోని సింగరేణి కాలనీ టేకులపల్లి, సింగరేణి హైస్కూల్‌, స్ధానిక వైసివోఏ క్లబ్‌ లో  సింగరేణి మహిళలకు, పిల్లలకు  ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, క్విజ్, వ్యాసరచన పోటీలు, హస్యవల్లరి, దేశభక్తి గేయాల పోటిలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 31వ తేదిన ఉత్తమ గృహలంకరణ, మొక్కలు పెంపకం పోటీలు నిర్వహించబడునన్నారు.

జూన్ 2వ తేది ఆవిర్భావ దినోత్సవం నాడు ఉదయం 7 గంటలకు తెలంగాణ పరుగులో భాగంగా జగదాంబ సెంటర్‌లోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, ఫ్రోఫేసర్ జయశంకర్ పటానికి, తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలలు వేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు వివిధ స్టాల్స్, తెలంగాణ రుచులు, ఫోటో గ్యాలరీ, సేవాసమితి ఉత్పత్తులు, సంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. సింగరేణియులు వారి కుటుంబాలు, పట్టణ ప్రజలు, ప్రముఖులు పాల్గోని వేడుకలను విజయవంతం చేయాలని జిఎమ్ ఎమ్. సురేష్ కోరారు.

Celebrations for Telangana Formation Day in Singareni