Wednesday, April 24, 2024

కమలాహారిస్ గ్రామంలో మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు

- Advertisement -
- Advertisement -

Celebrations in Tamil Nadu during swearing in of Kamalaharis

 

చెన్నై: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా తమిళనాడులోని ఆమె అమ్మమ్మ పూర్వీకుల గ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు. తిరువారూర్ జిల్లాలోని కమల అమ్మమ్మ గ్రామం తులసేంద్రిపురంతోపాటు పక్కనున్న మరో గ్రామం మన్నార్‌గుడిలో రాజకీయాలకు అతీతంగా మిఠాయిలు పంచి పెట్టారు. గ్రామంలోని వీధులను శుభ్రం చేసి కమలాహారిస్ ఫోటోలతో డిజిటల్ బ్యానర్లను ఏర్పాటు చేశారు. పలు వ్యాపార సంస్థలు కమల, బైడెన్‌లతో ఉన్న క్యాలెండర్లను పంచి పెట్టాయి. కమల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు ఆమె పేరిట ఆలయాల్లో ప్రార్థనలు చేశారు. కమల ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేయడాన్ని టీవీల్లో తిలకించడానికి సిద్ధమయ్యారు. కమలాహారిస్ తల్లి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా, ఆమె తండ్రి జమైకాకు చెందినవారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News