Home తాజా వార్తలు కోడి రామకృష్ణ మృతిపట్ల ప్రముఖుల సంతాపం

కోడి రామకృష్ణ మృతిపట్ల ప్రముఖుల సంతాపం

 

 

హైదరాబాద్: కోడి రామకృష్ణ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని కెసిఆర్ పేర్కొన్నారు. దర్శకుడు రామకృష్ణ కన్నుమూయడం ఎంతో బాధాకరమని బాలకృష్ణ తెలిపారు. ఆయన తనతోనే ఎక్కువ సినిమాలు చేశారని బాలయ్య గుర్తు చేశారు. టాలీవుడ్ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని నటుడు అలీ ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండ్ దర్శకుడిని కోల్పోయిందని జూనియర్ ఎన్‌టిఆర్ తెలిపారు. కోడి మరణవార్త తనని ఎంతో కలచివేసిందని హీరో మహేష్ బాబు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మహేష్ బాబు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. శనివారం కోడి రామకృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

 

Celebrities Condolence on Death of Kodi Ramakrishna