Friday, April 26, 2024

కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు

- Advertisement -
- Advertisement -

Corona Virus

ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా లాకౌట్ ప్రకటించిన పలు దేశాల ప్రభుత్వాలు ఎవరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశాయి. అయితే దీనివలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద,- దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. వారికి తోడుగా ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ తమ వంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు.

తెలంగాణ ఎపి సినీ కార్మికులు ప్రధాన మంత్రి

సహాయనిధి

చిరంజీవి 1 కోటి
మహేష్ బాబు  50 లక్షలు 50 లక్షలు
పవన్ కల్యాణ్  50 లక్షలు  50 లక్షలు 1 కోటి
ఎన్ టిఆర్ 25 లక్షలు  25 లక్షలు  25 లక్షలు
ప్రభాస్  50 లక్షలు  50 లక్షలు 3 కోట్లు
రామ్ చరణ్  35 లక్షలు  35 లక్షలు
నితిన్  10 లక్షలు  10 లక్షలు
పివి సింధు  5 లక్షలు  5 లక్షలు
సచిన్  25 లక్షలు

మహారాష్ట్ర

25 లక్షలు

కరోనాపై పోరాటానికి యంగ్ హీరో నితిన్‌తో మొదలైన ఆర్ధికసాయం ఇప్పుడు ఊపందుకుంది. ముందుగా నితిన్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధిలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల విరాళాన్ని అందజేశారు. ఇక కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. “కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత విషమ పరిస్థితులను అధిగమించాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గం. ఇది దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సినీ కార్మికుల సంక్షేమ నిధికి కోటి రూపాయల విరాళాన్ని అందజేస్తున్నా”అని చిరంజీవి పేర్కొన్నారు. ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 50 లక్షలు చొప్పున, కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయిలు చొప్పున మొత్తం 2 కోట్లు విరాళంగా అందజేయడం విశేషం. సూపర్‌స్టార్ మహేష్ బాబు కరోనాపై పోరాటం చేస్తున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 50 లక్షలు చొప్పున – మొత్తం కోటి రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

“కరోనాను నియంత్రించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ పోరాటంలో నేను భాగస్వామిని కావాలనుకుంటున్నాను. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధిలకు కోటి రూపాయల విరాళం ఇస్తున్నాను”అని పేర్కొన్నారు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున – మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కరోనాపై పోరుకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.75 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధిలకు రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలతో పాటు మరో రూ.25 లక్షలను ఉపాధి కోల్పోయిన పేద సినీ కార్మికుల కోసం అందజేశారు. రామ్‌చరణ్ – కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మొత్తం రూ. 70 లక్షలను విరాళంగా అందజేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

అదేవిధంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షలు విరాళంగా ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనిల్ రావిపూడి – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు విరాళంగా అందజేశారు. యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు విరాళంగా అందజేయడం జరిగింది. సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ -సినీ కార్మికుల కోసం తన వంతుగా రూ.5 లక్షల విరాళం అందించారు. ఈ చెక్కును నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మనం సైతం ఫౌండేషన్’కు అందజేశారు. సినీ కార్మికులు ఎవరైనా సరే నిత్యావసరాలకు ఇబ్బందిపడుతుంటే నేరుగా కాదంబరి కిరణ్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని అన్నారు. అలాగే ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగస్వామ్యం కావాలని వి.వి.వినాయక్ కోరారు. హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం తాను చేస్తున్న ‘నాంది’ సినీ కార్మికులు 50 మందికి చిత్ర నిర్మాత సతీష్ వేగశ్నతో కలిసి ప్రతి ఒక్కరికి రూ.10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇక స్టార్ కమేడియన్ అలీ రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు లక్షల విరాళాన్ని ప్రకటించారు.

 

Celebrities Donations for Corona Virus

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News