Home హైదరాబాద్ చరవాణిలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే…

చరవాణిలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే…

Driving

ఇటీవల ఇద్దరికి రెండురోజుల శిక్ష
ఐదు రోజుల్లో 740 కేసులు నమోదు
డ్రైంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 168 మందికి జైలు
72 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

మన తెలంగాణ/ సిటీబ్యూరో: ఇక సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వాహనం నడిపినా జైలు శిక్ష తప్పదు. ఇప్పటి వరకు మద్యం మత్తులో వాహనాలను నడిపిన వారినే లక్షంగా చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ట్రాఫిక్ నియమ,నిబంధనలను ఉల్లంఘించిన వారిపైనా కేసులు నమోదు చేస్తూ న్యాయ స్థానాల ముందు నిలపాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే గత నాలుగు రోజులుగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను తోలుతున్న ఇద్దరు వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసి కోర్టులో నిలిపారు. వారికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో ట్రాఫిక్ నియమ, నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు, కౌన్సెలింగ్‌లు, జైలు తప్పవనే సంకేతాలు వెలువడ్డాయి.5 అండ్ డ్రైవ్ తనిఖీలంటే మద్యం సేవించి వాహనాలను నడిపే వారికోసమేననే అభిప్రాయం ప్రచారంలో ఉన్నది. అయితే, ఇప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడిపినా కేసులు నమోదు చేయడానికి నగర పోలీసులు శ్రీకారం చుట్టారు. దీంతో వాహనదారులు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవింగ్ : చాలా సందర్భాల్లో ద్విచక్రవాహనదారులు కొందరు చెవుల్లో ఈయర్‌ఫోన్లు పెట్టుకుని, మరికొందరు మొబైల్ ఫోన్‌నే చెవికి భుజానికి మధ్య ఏర్పాటుచేసుకుని మాట్లాడుకుంటూ వాహనాలను నడుపుతుంటారు. వీరి ఫలితంగా ఎదురు నుండి వెళ్ళే, వెనుకగా వచ్చే వాహదారులకు డ్రైవింగ్‌లోనూ, వాహనం మలుపుల్లోనూ, వేగంలోనూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. పలు సందర్భాల్లో ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే, ఇది గమనించిన నగర ట్రాఫిక్ పోలీసులు సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ వాహనాలను నడుపుతున్న వారిపైనా కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదుచేసి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 3,4 కోర్టుల్లో హాజరుపరచగా వారికి రెండురోజులు జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించాయి.

740 కేసులు నమోదు : ఈ నెల 1923 వరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసుల మొత్తం 740 కేసులు నమోదు చేశారు. ఇందులో 168 మందికి జైలు శిక్ష విధించింది. ఇందులో 15 రోజుల నుండి 2 రోజుల వరకు జైలు శిక్షలుపడ్డాయి. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 72 మంది డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దుపరిచింది. రూ. 15.84 లక్షలు జరిమానా విధించడం జరిగింది. శిక్షలుపడినవారిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్నవారు(24), అధికశాతం ట్రాఫిక్ నియమాలను అతిక్రమించినవారు(8), సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను తోలినవారు(2), ప్రమాదకరంగా వాహనాలను నడిపిన(5) మంది ఉన్నారు. కాగా మూడేళ్ళు లైసెన్స్ రద్దు కాబడింది 1, రెండేళ్ళు 10 మందికి, ఏడాది 10 మందికి, 3 నెలలు లైసెన్స్ రద్దు అయివారు 51 మంది ఉన్నారు.