Home తాజా వార్తలు ఫైఓవర్‌పై నుంచి కింద పడ్డ లారీ: డ్రైవర్‌ మృతి

ఫైఓవర్‌పై నుంచి కింద పడ్డ లారీ: డ్రైవర్‌ మృతి

accident

హైదరాబాద్‌: రింగ్‌రోడ్‌ వంతెనపై నుంచి సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి కిందపడిన ప్రమాద ఘటన శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ దగ్గర శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో లారీ డ్రైవర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా… క్లీనర్ తీవ్రంగా‌ గాయపడ్డాడు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం అల్వాలోని ఆస్పత్రికి పంపించారు. కీసర నుంచి మేడ్చల్‌ వైపు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Cement lorry Fell under from Shamirpet ORR